Crime News: కూతురి స్నేహితురాలిపై అత్యాచారయత్నం.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా కూతురి స్నేహితురాలిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. చిన్న పిల్ల అని చూడకుండా తన బైక్పై తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరులో చోటుచేసుకుంది.
Security Guard : ఓనర్ను కత్తితో పొడిచిన సెక్యూరిటీ.. అలా చేశాడన్న కోపంతో దారుణం
Also Read
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
చిలమత్తూరులో గ్రామంలో నివసించే శ్రీనివాసులు ఇంటి ముందు ఓ చిన్నారి తన స్నేహితురాలితో ఇంటి ముందు ఆడుకుంటోంది. అప్పుడు ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను శ్రీనివాసులు బైక్పై తీసుకెళ్లాడు. ఆ పాప అంకుల్ అంటూ బండి మీద కూర్చుంది. ఎవరూ లేని ప్రదేశం చూసి తన కుమార్తె స్నేహితురాలిపై శ్రీనివాసులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి గట్టిగా ఏడ్వడంతో అక్కడికి గ్రామస్థులు చేరుకున్నారు. ఆ కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ నిందితుడిపై ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!