Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Perni Nani Slams Tdp Govt And Police That Is My Job Strong Remarks Spark Controversy

Perni Nani: అదే నా ఉద్యోగం, పని.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్!

Published Date :April 3, 2026 , 1:42 pm
By Sampath Kumar
  • మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా
  • నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?
  • మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?
  • మీకు చేతనైతే ఆ విషయంపై స్పందించండి
Perni Nani: అదే నా ఉద్యోగం, పని.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడే వారికి అండగా ఉండటమే తన ఉద్యోగం అని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే తన పని అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా అని.. అన్యాయానికి గురైనోడే ప్రశ్నిస్తాడన్నారు. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారని విమర్శించారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు జైపాల్‌పై పేర్ని నాని ఫైర్ అయ్యారు.

‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైసీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే.. ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంత మాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు.. మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి. నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?. పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం. మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?. కంకిపాడులో పేకాట ఆడిస్తున్నందుకు పరమేశ్వర్ సస్పెండ్ అయ్యాడు. మీకు చేతనైతే ఆ విషయంపై స్పందించండి’ అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.

‘తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడే వారికి అండగా ఉండటమే నా ఉద్యోగం. పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే నా పని. మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన నేను ప్రశ్నించడం ఆగదు. జైలు లోపల ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారు. నేను పోలీసు వ్యవస్థ అంతటినీ కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఎవరి ప్రశ్నించినా కేసులు పెట్టి లోపల వేస్తున్న నియంత పాలన సాగుతోంది. జైపాల్తో కృష్ణా జిల్లాలో ఉన్న పోలీసులందరికీ మోటివేషన్ క్లాసులు పెట్టించాలని ఎస్పీని కోరుతున్నాం. సీఎం చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ సీఐని ఎందుకు ట్రాన్స్ ఫర్ చేయించారు. 2014లో కొల్లు రవీంద్ర మంత్రి మచిలీపట్నం తాలూకా సీఐని విధుల్లో చేరకుండా అడ్డుకున్నాడా లేదా. డీజీపీ చెప్పినా కుదరదని కొల్లు రవీంద్ర చెప్పిన విషయం మీకు గుర్తులేదా?. డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు పోస్టింగ్ రావడం లేదని జైపాల్ తెలుసుకోవాలి. పేర్ని నాని ఎప్పుడూ, ఎన్నడూ పోలీస్ శాఖను బెదిరించలేదు. తప్పుడు పనులు చేసే వారిని, రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉన్న వారినే నేను హెచ్చరించా’ అని పేర్ని నాని స్పష్టం చేశారు.

‘ఒకడు లంచం తీసుకుంటే పోలీసులంతా లంచం తీసుకున్నట్లేనా. తప్పుడు పనులు చేసే వారిని ప్రశ్నించడం నేరమా. నేను చేసింది నేరమే అయితే మీరు ఏం చేసినా శిరసా వహిస్తా. కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?. నిన్న మీరు విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లెటర్ అసలైనదేనా ఓసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ సంతకం చేశారా, మీరు హడావిడిగా చేయించారా. మీరు విడుదల చేసిన లెటర్లో మున్సిపల్ కమీషనర్ సంతకం ఒరిజినల్ కాదు. పామర్రు స్టేషన్లో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పిస్తారా?. ఆ ఫుటేజ్ ఇప్పించండి, నేను క్షమాపణ చెబుతా. కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను కూల్చడానికి బందోబస్తు ఇచ్చారు. బందోబస్తు రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి, నేను పోలీసుల పాత్ర గురించి మాట్లాడను. అన్యాయాన్ని ప్రశ్నించిందని ఓ దళిత యువతిని కొట్టి జైల్లో పెట్టారు. మీ ఇష్టానుసారంగా కేసులు పెడితే ఎవరినీ ప్రశ్నించకూడదా. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి జైపాల్ సార్. మా అబ్బాయి పేర్ని కిట్టును మీ దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తా’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • ap politics
  • Perni Nani
  • Perni Nani Comments
  • police controversy AP

తాజావార్తలు

  • Perni Nani: అదే నా ఉద్యోగం, పని.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్!

  • Iran US Israel War: ట్రంప్‌కు ట్రంప్ స్టైల్‌లోనే కౌంటర్.. ఇరాన్ కొత్త ప్లాన్ రెడీ.. ఇక యుద్ధానికి ఎండ్ కార్డు?

  • Tina Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న టీనా అంబానీ

  • Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

  • SDT 19: మెగా మేనల్లుడితో ‘క’ డైరెక్టర్స్ క్రేజీ ప్రాజెక్ట్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూశారా

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions