NTV Telugu Site icon

Perni Nani: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. ఆ అధికారులపై చర్యలు తప్పవు..!

Perni Nani

Perni Nani

Perni Nani: వచ్చే నెల 4వ తేదీ తర్వాత మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. పక్షపాత ధోరణితో వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని.. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. ఏపీలో పోలింగ్‌ తర్వాత జరిగిన హింసపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.. బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, గవర్నర్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. ఉద్దేశ పూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం అని ఆరోపించారు. ఇక, హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం వైఎస్‌ జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు కోరారని తెలిపారు.. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదని మండిపడ్డారు..

Read Also: Rashmi Gautam : చేతిలో వైన్ గ్లాస్.. కిక్ లో రష్మీ.. రచ్చ మాములుగా లేదుగా..

ఎన్నికలు పక్షపతం లేకుండా ఏక పక్షంగా జరిగేలా ఎవరు చేశారో గవర్నర్ కు తెలిపాం అన్నారు పేర్ని నాని.. హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు ఉంటాయని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు అని గవర్నర్ కు తేలిపాం అన్నారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు.. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారని విమర్శించారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు.. జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్ లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్ ను కోరాం అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.