యాంకర్ రష్మీ గౌతమ్ పేరు అందరికి తెలుసు.. ముఖ్యంగా యూత్ కు ఈ పేరంటే ఇష్టం.. అప్పట్లో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో యాంకర్ గా రానిస్తూనే, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. తాజాగా స్టైలిష్ లుక్ లో వైన్ గ్లాస్ పట్టుకొని ఫోటోకు పోజులిచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
పాప ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది.. ట్రెండ్ కు తగ్గట్లు అదిరిపోయే డ్రెస్సులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.. అంతేకాదు సమాజంలో మూగ జీవాల పై జరిగే అన్యాయాలను ఎదురిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా వైన్ గ్లాస్ పట్టుకొని, ఫుల్ కిక్ లో రష్మీ.. వైన్ బాటిల్ ను పట్టుకొని క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకుంటుంది .. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక ఈ అమ్మడు బుల్లితెర పై ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం బుల్లితెర పై రెండు షోలల్లో కనిపిస్తుంది. ఆ మధ్య సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపిస్తుందన్న వార్తలు వినిపించాయి.. కానీ అందులో నిజం లేదని ఇద్దరు ఫ్రెండ్స్ అని తెల్చేశారు.. ఇక సినిమాల విజయానికొస్తే.. ఇటీవల భోళా శంకర్ సినిమాలో చేసింది.. మళ్లీ మంచి పాత్రల కోసం, స్పెషల్ సాంగ్‌ల కోసం, బోల్డ్ రోల్స్ సైతం చేసేందుకు ఆమె సిద్ధంగానే ఉంది..