Site icon NTV Telugu

Perni Nani: పవన్‌కి ఈ కొత్త బాధ ఏంటో..? ఆయనది ఏపీ కాదా..?

Perni Nani

Perni Nani

Perni Nani: ఏపీ మంత్రులు, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మండిపడిన విషయం విదితమే.. పాలకుల మధ్య విమర్శలు, ఆరోపణలు, పత్యారోపణలు చేసుకోండి.. కానీ, ప్రజలపై ఎందుకు మాట్లాడడం? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. అయితే, పవన్‌ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి పేర్నినాని.. తాడేపల్లిలోమీడియాతో మట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ జనం మర్చిపోతున్నారని అప్పుడప్పుడు ట్వీట్ పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మాట్లాడటం నా మనసు గాయపరిచింది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. తెలంగాణ ప్రజలను ఏమి అనకపోయినా పవన్ మా పై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ బాధ పడుతున్నారు. పవన్ కి ఈ కొత్త బాధ ఏంటో అర్ధం కావడం లేదన్నారు.

తెలంగాణకు చెందిన మంత్రి మన రాష్ట్రాన్ని అవమనిచేలా మాట్లాడితే ఏపీ మంత్రులు స్పందించారని తెలిపిన పేర్నినాని.. అసలు పవన్ కళ్యాణ్ ది ఆంద్రప్రదేశ్ కాదా? రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ కావాలా? ఆయన తెలంగాణ వాళ్ళకి లొంగి పోయాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ మంత్రి ఏపీని కించ పరిస్తే అది వేరే ఇది అని పవన్ అంటున్నారు.. తెలంగాణ తరుపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవి కిరాయి మాటలు కాదా? అని నిలదీసిన ఆయన.. ఇంతకు ముందు చంద్రబాబు, లోకేష్ ని అంటే పవన్ వచ్చే వాడు. ఇప్పుడు తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే వకాల్తా పుచ్చుకుంటున్నాడు అని మండిపడ్డారు. ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటో అర్ధం కావడం లేదన్నారు.

మరోవైపు, వైఎస్‌ వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిలను వదిలేసి, అసహజ రీతిలో విచారణ జరుగుతుందని విమర్శించారు పేర్నినాని.. రాం సింగ్ తప్పుడు మార్గంలో విచారణ జరిపారన్న ఆయన.. సుప్రీంకోర్టు రాం సింగ్ ని పక్కన పెట్టమని చెప్పింది. అదే రీతిలో ఇప్పడు వచ్చిన అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు.. రాజకీయ కోణంలో విచారణ జరపడం వెనుక ఒత్తుడులు, లొంగుబాటు ఉన్నాయని ఆరోపించారు.. చంద్రబాబు సీఎం గా ఉండగా జగన్ పై హత్య యత్నం జరిగింది. చంద్రబాబు టైమ్ లో ఏం విచారణ జరిగింది? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తప్పుడు దర్యాప్తు చేసిందని విమర్శించారు.. చంద్రబాబు అన్ని వ్యస్థలను వశపర్చుకోవడంలో సిద్ధ హస్తుడు.. వివేకా కుమార్తె సునీత, రాంసింగ్.. చంద్రబాబు ప్రలోభాలకు, ఒత్తిడికి లొంగిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్నినాని.

Exit mobile version