Site icon NTV Telugu

Perni Nani: అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా..! పవన్‌ కల్యాణ్‌కు పేర్నినాని కౌంటర్‌..

Perni Nani

Perni Nani

Perni Nani: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. రాజోలు, రాజానగరం స్థానాలకు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను ప్రకటించడంపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. రాజకీయ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని.. ఇప్పటికే వీళ్ల డ్రామాలకు ప్రజలు నవ్వుకుంటున్నారు.. తాజాగా మరో కొత్త డ్రామా తెరపైకి తీసుకుని వచ్చారని దుయ్యబట్టారు. గడచిన నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీకి ఇంఛార్జిలే లేరని.. ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు.. జనసేనకే వదిలేశాడన్న ఆయన.. తనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్‌ ఈ రోజు ప్రకటించాడు.. కానీ, తనపై జనసైనికుల్లో, పార్టీ నేతల్లో వస్తున్న వ్యతిరేకత చల్లార్చెందుకే ఈ అభ్యర్థుల ప్రకటన డ్రామా..! అని ఎద్దేవా చేశారు. తనని తిడుతున్న పార్టీ కార్యకర్తలను జోకొట్టడానికి ఇదో డ్రామా మాత్రమే.. నిజంగా పవన్ కల్యాణ్‌కు పౌరుషం నికార్సు అయినది అయితే.. కీలక స్థానాలను ప్రకటించే వాడన్నారు. ఇక, వన్‌కు అంత పౌరుషం ఉంటే వైజాగ్, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదు..? అని నిలదీశారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాగా అభివర్ణించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.

Read Also: Putin Praises PM Modi: ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు.. ఏమన్నారంటే..

Exit mobile version