Perni Nani: అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా..! పవన్ కల్యాణ్‌కు పేర్నినాని కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. రాజోలు, రాజానగరం స్థానాలకు పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించడంపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రాజకీయ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని.. ఇప్పటికే వీళ్ల డ్రామాలకు ప్రజలు నవ్వుకుంటున్నారు.. తాజాగా మరో కొత్త డ్రామా తెరపైకి తీసుకుని వచ్చారని దుయ్యబట్టారు. గడచిన నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీకి ఇంఛార్జిలే లేరని.. ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు.. జనసేనకే వదిలేశాడన్న ఆయన.. తనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రకటించాడు.. కానీ, తనపై జనసైనికుల్లో, పార్టీ నేతల్లో వస్తున్న వ్యతిరేకత చల్లార్చెందుకే ఈ అభ్యర్థుల ప్రకటన డ్రామా..! అని ఎద్దేవా చేశారు. తనని తిడుతున్న పార్టీ కార్యకర్తలను జోకొట్టడానికి ఇదో డ్రామా మాత్రమే.. నిజంగా పవన్ కల్యాణ్‌కు పౌరుషం నికార్సు అయినది అయితే.. కీలక స్థానాలను ప్రకటించే వాడన్నారు. ఇక, వన్‌కు అంత పౌరుషం ఉంటే వైజాగ్, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదు..? అని నిలదీశారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాగా అభివర్ణించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.
Read Also: Putin Praises PM Modi: ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు.. ఏమన్నారంటే..
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!