మహానాడులో చంద్రబాబు ఉపన్యాసం అంతా పరనిందా, ఆత్మస్తుతి అని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైకిల్ కరెంట్ పెడితే దూసుకుని పోతుందని అంటున్నాడని, సైకిల్, మోటార్ బండి ఒకటి అవుతుందా?? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు దొంగిలించిన సైకిల్ అది అని, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు హస్తం నీడలో ఉన్నాడన్నారు. లక్ష్మి పార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌ను, ప్రకటించిన చంద్రబాబు కుటుంబ ఆస్తి వెయ్యి కోట్లు అని, ఎన్నికల అఫిడవిట్, ఇన్‌కం ట్యాక్స్ లో డిక్లేర్ చేసిన విషయమే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుడు చంద్రబాబు. మీ నాన్న ఖర్జూర నాయుడు నీకిచ్చిన ఆస్తి ఎంత?? రెండు ఎకరాల నుంచి వేయి కోట్ల ఆస్తి ఎలా సంపాదించావ్?? ఏం వ్యాపారం చేశావ్?? ముఖ్యమంత్రి జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు. తన ఆస్తిలో సగం ఉన్న ముఖ్యమంత్రిని దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అని చంద్రబాబు చెబుతున్నాడు.
Sai Dharam Tej: చక్రవ్యూహం ట్రైలర్ లాంచ్ చేసిన సుప్రీమ్ హీరో
ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారు అనే దొంగ తెలివి తేటలు చంద్రబాబువి. ఎన్టీఆర్ దగ్గర ఆషాఢభూతి వేషం వేసింది చంద్రబాబు కాదా?? ఓట్ల కోసం నక్క వేషాలు వేసేది చంద్రబాబు. 2024లో అధికారంలోకి వస్తే పేదలను కోటీశ్వరులను చేస్తాను అంటున్నాడు చంద్రబాబు. 1996 నుంచి 2004, 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎంత మంది పేదల్ని కోటీశ్వరులను చేశారు.
లిస్ట్ విడుదల చేయాలి. ఓట్ల కోసం తప్పుడు మాటలు మాట్లాడతాడు చంద్రబాబు. ఇన్నేళ్ళల్లో ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు ఏదో చేస్తాను అంటే ప్రజలు ఎందుకు నమ్మాలి. అప్పులే చంద్రబాబు సృష్టించిన సంపద. చంద్రబాబు వెళ్ళే సమయానికి 40 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టాడు.
CM KCR : ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి
28 ఏళ్ళ తరువాత కూడా రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ ఇచ్చాడని చెబుతారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జల యజ్ఞం, వ్యవసాయానికి ఉచిత విద్య అనగానే వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా ఈ పథకాలను కొనసాగించాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది. సచివాలయ వ్యవస్థ, అమ్మ ఒడి, మెడికల్ కాలేజీలు, మూడు పోర్టుల నిర్మాణం జగన్ హయాంలో జరుగుతున్నాయి. చంద్రబాబు బతుక్కి ఇలా చెప్పుకోగలిగే ఒక్క పథకం అయినా ఉందా??. ఎన్టీఆర్ శకం, వైఎస్ఆర్ శకం ఉన్నాయి. భవిష్యత్తులో జగన్ శకం కూడా ఉంటుంది. చంద్రబాబు శకం ఏది??’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.