పవన్ కి ఏదో ఒకటి మాట్లాడటం అలవాటని, జనం నవ్వుకుంటారని కూడా పవన్ కు లేదని విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పై బురద చల్లడమే పవన్ పనిగా పెట్టుకున్నాడని, 1962, 63 లో తెలంగాణ ఉద్యమం జరిగింది అప్పుడు ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కూడా ఆస్తులు కొనుకుంటున్నాడు ఫోటో లు దిగి పెడుతుంటాడు కదా… ఉద్దేశపూర్వకంగా బురద చల్లడం తప్ప ఏమి లేదు అని పేర్ని నాని ధ్వజమెత్తారు. కిరాయి తీసుకున్నాడు కదా ఎదోటి మాట్లాడాలని, నేను చంద్రబాబు కోసం పనిచేస్తున్నాను అని పవన్ ధైర్యంగా చెప్పాలన్నారు.
Also Read : Kishan Reddy: ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరం ఉంది
టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తామని చెప్పాలని, టీడీపీ ఇంచార్జీ పెట్టిన చోట జనసేన ఇంచార్జీ లను పెట్టదన్నారు. నువ్వు నిజాయితీ గలవాడివి అయితే నేను చంద్రబాబు గత 2014 నుండి 2019 వరకు చేసిన పరిపాలన కొనసాగిస్తామనీ అని చెప్పు అన్నారు పేర్ని నాని. జగన్ నీ అటాడించే సత్తా వున్నోడివి స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడవని, సినిమా గ్లామర్ ను అడ్డం పెట్టుకొని ప్రజలను అమ్మేస్తున్నావ్ అని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ నుండి ఎవ్వరినీ పార్టీలోని రానివ్వను అని చెప్పావ్.. ఇప్పుడు బస్టాప్ దగ్గర టాటా మేజిక్ మాదిరిగా రండి అని ఎదురు చూస్తున్నావు.. పవన్ వి నిలకడ లేని రాజకీయాలు అంటూ పేర్ని నాని సెటైర్లు గుప్పించారు.
Also Read : Landslides: ఆలయంపై కొండ చరియలు పడటంతో 9 మంది మృతి
