NTV Telugu Site icon

Musi River : ప్రభుత్వానికి షాక్.. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు

Musi River

Musi River

ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. తమ ఇళ్ళు కూల్చివేయొద్దు అంటూ హై కోర్టు నుంచి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఏ ఇంటి వద్ద చూసిన కోర్ట్ స్టే లే దర్శనమిస్తున్నాయి. దాదాపు 100 ఇళ్ల యజమానులు స్టే తెచ్చుకున్నట్లు సమాచారం. మూసి సుందరీకరణ కోసం తమ ఇండ్లు ఇవ్వమంటున్న ఇంటి యజమానులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపోరాటం చేయడానికి ఏందాకైనా పోతామని చెబుతున్నారు.

READ MORE: AP Liquor Shops Lottery: లక్కంటే ఆయనదే.. మద్యం షాపుల లాటరీలో ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు!

ఇదిలా ఉండగా.. మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ బెడ్లోని ప్రవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ ఇటీవల తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసి పునరావసం కల్పిస్తామన్నారు. దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసిందని తెలిపారు. అలాగే, రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని మూసీ రివర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు.

READ MORE:Delhi: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. జనవరి వరకు టపాసుల కాల్చివేత నిషేధం

అలాగే, డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి పునరావసం కల్పించిన తర్వాతనే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతోంది అని దాన కిషోర్ ప్రకటించారు. బఫర్ జోన్కు సంబంధించి భూ సేకరణ, పునరావాస చట్టం ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.. ప్రభుత్వ అనుమతి తర్వాత చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇచ్చిన తర్వాత మాత్రమే భూసేకరణ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మూసీ నది పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దని.. అర్హులందరికీ పునరావాసం కల్పించడం జరుగుతుంది అని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ వెల్లడించారు.