సాధారణంగా బట్టల దుకాణాలు పండుగల సందర్భంగా కొత్త ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. లేకపోతే పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునే సమయంలో కస్టమర్లను ఆకట్టుకునేలా 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే కోల్‌కతాలోని ఓ బట్టల షాప్ నిర్వాహకులు వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఆ పబ్లిసిటీ కొందరిని ఆకట్టుకుంటుండగా.. మరికొందరి చేత మాత్రం విమర్శలు పొందుతోంది.
Read Also: బటన్ నొక్కితే చాలు… ఈ కారు రంగు మారిపోతుంది…!!
వివరాల్లోకి వెళ్తే… సుల్తాన్ బట్టల షాప్ నిర్వాహకులు ‘మిస్సింగ్’ అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. సదరు ప్రకటనలో ఓ యువకుడి ఫోటోను ప్రచురించి దాని కింద ఓ మేటర్‌ను రాశారు. ‘బాబూ మజ్ను. నీ డిమాండ్లన్నీ ఒప్పుకుంటున్నాం. లైలాతోనే నీకు వివాహం జరిపిస్తాం. అంతేకాదు పెళ్లికి షేర్వాణి కూడా నువ్వు కోరుకున్న సుల్తాన్ దుకాణంలోనే కొనుగోలు చేస్తాం. కొత్తగా పెట్టిన బ్రాంచీలో పార్కింగ్ సౌకర్యం కూడా ఉందట. కనుక అక్కడే షాపింగ్ చేద్దాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటన చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. బట్టల షాప్ ప్రకటనలు ఇలా కూడా ఇస్తారా బాబూ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
