NTV Telugu Site icon

Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 36కు చేరిన మృతులు

Cnd

Cnd

అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు దెబ్బ తిన్నాయి. ఇళ్లల్లోకి నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు భారీ వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల ఆ ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు..

కొపిలీ, బరాక్, కుషియారా వంటి నదులు ప్రమాదకర స్థాయి మించి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. వరదల వల్ల 19 జిల్లాల్లో నివసిస్తున్న 4 లక్షల మంది పరిస్థితి దయనీయంగా మారినట్లు పేర్కొన్నాయి. ఈ విపత్తు ప్రభావం కరీంగంజ్ జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు.. అక్కడ 2.5 లక్షల మందిపై ప్రభావం పడినట్లు చెప్పారు. ఇప్పటివరకూ వరదల్లో, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Vegetables- Fruits Price: సామాన్యులను బెంబేలెత్తిస్తున్న పండ్లు, కూరగాయల ధరలు..

అసోం వరద బాధితులకు కాంగ్రెస్ అండగా నిలిచింది. వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. 15 జిల్లాల్లో లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని.. ఇప్పటి వరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారని ఖర్గే పేర్కొన్నారు. అసోం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావంగా నిలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నామని ఖర్గే ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. రాష్ట్రంలో వరద బాధిత ప్రజలకు సహాయ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని అసోం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కోరారు.

ఇది కూడా చదవండి: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..