Samantha: చైతుతో విడాకుల తర్వాత సమంత టైం మారిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తుండగానే వ్యాధి కారణంగా ప్రస్తుతం కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత బాలీలో ఉంది. వెకేషన్ లో భాగంగా ఇండోనేషియా వెళ్లింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేస్తోంది. సందర్భానికి తగినట్లు, అలాగే వెళ్లిన ప్రాంతానికి తగ్గట్లు బట్టలు ధరించాలి. లేక పోతే వారి ఫ్యాన్స్ హట్ అవుతారు. స్టార్ హీరోయిన్స్ కు ఇది తప్పనిసరి వారి కోసమైన అలా చేయాల్సిందే. లేదంటే ఫ్యాషన్ సెన్స్, కామన్ సెన్స్ లేదంటారు.
Read Also:Hyderabad :వర్షంలో బండి ఆగిందా? ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి..!
సమంత ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఆమె తాను నటించే ప్రతి సినిమాకు నాలుగైదు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక యాడ్స్, ప్రమోషన్స్ తో మరికొంత ఆదాయం సంపాదిస్తుంది. ఇంత మొత్తం సంపాదన కలిగిన సమంత అదే రేంజ్ లో మెయింటేన్ చేస్తుంది. ప్రస్తుతం సమంత ధరించిన ఓ డ్రెస్ ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Read Also:Jayashankar Bhupalpally: వరదలో మునిగిన గ్రామం.. బిల్డింగ్, చెట్లు ఎక్కిన జనం
బాలీ ద్వీపంలో సమంత గ్రీన్ కలర్ ట్రెండీ వేర్ ధరించారు. సదరు డ్రెస్ నెటిజెన్స్ ని ఆకర్షించిన నేపథ్యంలో వివరాలు సేకరించారు. ఇక ఆ డ్రెస్ ధర రూ. 37790 అట. చూసేందుకు చాలా సింపుల్ గా ఉన్న ఆ డ్రెస్ ఖరీదు అంతా అని నోరెళ్ళ బెడుతున్నారు.సమంత ధరించిన ఈ డ్రెస్ కల్ట్ గయా కామెరూన్ నిట్ డ్రెస్. సోషల్ మీడియాలో ఇంత చిన్న పొట్టి డ్రెస్ 37 వేల అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే.. జులై 13న సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసింది సమంత. ఆరు నెలలు కష్టంగా గడిచాయని సమంత తెలిపారు. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నిరంతరం పాల్గొన్న సమంత కష్టం మీద ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్లు వెల్లడించారు. కాగా ఆనారోగ్య సమస్యల దృష్ట్యా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించారు.