Peddi Sudharshan Reddy : రేపు రండి ప్రజల సమక్షంలో మాట్లాడదాం.. వైఎస్ షర్మిలకు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షర్మిల పాదయాత్రలో జరిగిన ఘటనపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఒక మహిళ కదాని ఓపిక పడపతుంటే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సమస్యలు లేవా అని ఆయన ప్రశ్నించారు. ముమ్మాటికి ఈ బాణాల వెనుక కేంద్రాన్ని నడిపే బీజేపీ ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఆనాడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నడిపిన ప్రభుత్వాలలోని సమస్యలు గుర్తుకు రాలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… ‘ వైయస్ రాజశేఖర రెడ్డి పేరు తెలంగాణలో ఎందుకు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలోని సమస్యలను అడిగే హక్కు ఉంది. కానీ వైయస్ షర్మిలకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.
Also Read : China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్‌పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్
నా గురించి నా వ్యక్తిత్వం గురించి మాట్లాడే హక్కు షర్మిలకు ఎక్కడిది. నాపై ఉన్న ఆస్తులన్ని మీ ముందుంచుతా… మీ ఆస్తులను కూడా ప్రజల ముందుంచాలి. విద్వేషపూరితమైన తప్పుడు మాటలు మాట్లాడితే మళ్లీ మీ పాదయాత్ర ఆగిపోతుంది… ఆపాదయాత్రను తెలంగాణ ప్రజలే ఆపుతారు…మా ప్రభుత్వంలో ఏమైన తప్పులుంటే సబ్జెక్టు పరంగా మాట్లాడండి స్వాగతిస్తాం. ఏపీ ప్రభుత్వంలో చేపట్టిన ప్రభుత్వ పథకాల పై మేము ప్రశ్నిస్తాం… వైఎస్ జగన్ ప్రభుత్వం పై మీలాగే మాట్లాడుతాం… హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తాం.. ట్రాక్టర్ డ్రైవర్ వు ఎమ్మెల్యే ఎలా అయ్యా ని ప్రశ్నించావు… నేను ముమ్మాటికి రైతు బిడ్డను… నన్ను అవమానపరిచావు దీనిపై షర్మిల స్పందించాలి. వేల కోట్లు సంపాదించావు అని అన్నారు కదా నన్ను…
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
Also Read : Power Charges: మళ్లీ విద్యుత్ చార్జీల మోత..! తెలంగాణ ఈఆర్సీకి ప్రతిపాదనలు..
రేపు రండి ప్రజల సమక్షంలో మాట్లాడదాం… ఎవరు వేల కోట్లు సంపాదించారో తేలుతుంది. పూర్వపు వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలోని భూముల బినామీలు ఎవరు… మీకెక్కడివి..? పూర్వపు జిల్లాలో ఎవరికి మీకు, మీ భర్తకు భూములున్నాయో అందరికీ తెలుసు… వాటిలో జెండాలు పాతడానికి సిద్ధం… నాకు తెలంగాణపై ప్రేమ ఉంది అని మాట్లాడే షర్మిల… ముందుగా కృష్ణ, గోదావరి లపై నీటి వాట ఎంత తేల్చమని మీ అన్నను, మీ బీజేపీ పెద్దలను అడుగు. గతంలో బయ్యారం గనులను అడ్డుకున్నది నేనే… ఆవిషయాన్ని మీరు మర్చిపోయారనుకుంటా గుర్తు తెచ్చుకోండి..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!