Site icon NTV Telugu

Peddi: కీలక పాత్రలో సీనియర్ నటి

Peddi

Peddi

Peddi: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కీలక ఫైనాన్షియర్ అయిన సతీష్ కిలారు నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్‌ అంతటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన “చికిరి చికిరి” అనే సాంగ్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

READ ALSO: Islamabad Blast: ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు.. ఎంత మంది చనిపోయారంటే..

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సీనియర్ నటి శోభన ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పెద్ది’ కథ ప్రధానంగా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, శోభన లాంటి సీనియర్ నటి కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్త ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

READ ALSO: IPL 2026: కోల్‌కతాకు రోహిత్‌ శర్మ.. ముంబై ఇండియన్స్‌ రియాక్షన్ ఇదే!

Exit mobile version