NTV Telugu Site icon

Namburu Sankara Rao: పల్లెల్లో సంక్షేమం చూడండి… పరుగులు పెడుతున్న అభివృద్ధి చూడండి..

Namburu

Namburu

గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ కార్యక్రమానికి భారీగా జన సందోహం తరలి వచ్చింది. ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలు చల్లుతూ.. మహిళలు హారతులు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామంలో ప్రచార రథంపై పర్యటించిన ఎమ్మెల్యే అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Read Also: Indian 2 : ఇండియన్ 2 కోసం వాయిస్ ఓవర్ అందించనున్న ఆ స్టార్ హీరో..?

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. 75 త్యాళ్లూరులో జరిగిన అభివృద్ధిని, అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. గ్రామంలో సుమారు 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అందించినట్టు వివరించారు. గ్రామంలో సుమారు రూ.1. 57 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించామన్నారు. నాడు- నేడు ద్వారా రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసి పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంలో సఫలమయ్యామన్నారు. సీఎం జగన్ పాలనలో అందరికీ మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చిన ఓట్లు అడుగుతున్నామని నంబురి శంకరరావు అన్నారు.

Read Also: Kedarnath: ఈనెల 10న తెరచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

టీడీపీ నేతలు వారి పాలనలో ఏం మంచి చేశారో చెప్పి ఓట్లు అడగాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సూచించారు. 27 కోట్లతో ఆస్పత్రులు బాగు చేశామన్నారు. టీడీపీ హయాంలో ఒక్క ఆస్పత్రి బాగు చేశారా.. ఒక్క స్కూల్ బాగు చేశారా అని ప్రశ్నించారు. 2014లో పొత్తులు, బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. మళ్లీ అదే కుట్రమార్గంలో మీ ముందుకు వస్తున్నారన్నారు. అలాంటి వారికి ఓటు వేస్తే.. పెత్తందార్ల పాలనతో పేదలు ఇబ్బందులు పడతారన్నారు. పేదల పక్షాన నిలబడి మేలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం చూసి మరోసారి తనను, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని నంబూరి శంకరరావు కోరారు.