గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు.
ఇవాళ ఒక్కరోజే నియోజకవర్గంలోని సుమారు 20 గ్రామాల నుంచి 500కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారిలో పెదకూరపాడు, హుస్సేన్ నగర్, బెల్లంకొండ, వెంకటాయపాలెం, అమరావతి, మునగోడు, అచ్చంపేట, వేల్పూరు, కస్తల మండలాలకు చెందిన 20 కుటుంబాలు టీడీపీని వదిలి పెట్టి వైసీపీలో చేరారు.
కాపులకు తానెప్పుడూ అండగా నిలిచానన్నారు. మరోసారి తనకు అండగా ఉండి ఆశీర్వదిస్తే.. నియోజకర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను అని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3వ తేదీన పెదకూరపాడు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో పాటు సుమారు 20 కుటుంబాలు వైసీపీలో చేరాయి.
ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలబెట్టిన తనను గెలిపించే బాధ్యత ప్రజలదైతే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని గెలిపించి.. సీఎం జగన్ కు బహుమతిగా ఇవ్వాలని అచ్చంపేట మండలం కస్తలలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఘనస్వాగతం పలికిన ప్రజలు.. హారతులు పట్టారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. వేల్పూరులో గత ఐదేళ్లలో 25 కోట్లతో సంక్షేమం అందించామన్నారు. రూ.2.59 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా రూ.2.18 కోట్లు అందించామన్నారు.…
ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తనను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు