MLA Rajasingh: హిందై ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సిద్ధంగా ఉన్నారని, ఆయన భార్య టీ. ఉషాబాయ్ పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీని, ముస్లిం ఓటు బ్యాంకును బుజ్జగించేందుకే హిందూ దేవుళ్లను అవమానపరిచిన మునావర్ ఫారుకీతో కేటీఆర్ కామెడీ షో చేయించారని ఆమె ఆరోపించారు. ఆగస్టు 20వ తారీఖు ఒక చౌకబారు కమెడియన్ ప్రోగ్రాం కోసం 2000 మంది పోలీసు వారిని వినియోగించి రాజాసింగ్ గారు అభ్యంతరం తెలుపుతున్నా ఈ మునావర్ ఫారుకి కామెడీ షో ని నిర్వహించారు. ఎన్నో న్యాయపరమైన కేసులను తన కామెడీ షో లో హిందూ దేవుళ్లని కించపరచడం ద్వారా మునావర్ ఫారుఖీ ఎదుర్కొంటున్నారు. ఇతని కామెడీ షో కి చాలా రాష్ట్రాలు అనుమతి నిరాకరిస్తున్నాయి. కానీ హైదరాబాదులో ఈ ప్రోగ్రాం ని కేటీఆర్ అండదండలతో నిర్వహించారు. అంటే కేటీఆర్ ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో అశాంతిని ప్రేరేపించారు. కాబట్టి కేటీఆర్ పైన పీడీ యాక్ట్ పెట్టి వెంటనే అరెస్టు చేయాలి.
Read Also: IAS Officer: అబ్బా అన్ని వందల కోట్లా.. మనోడు చేయి తిరిగినోడే
ఈరోజు కేటీఆర్ వల్లే ఎమ్మెల్యే రాజాసింగ్ గారు జైల్లో ఉన్నారు. ఇలాంటి చౌకబారు కామెడీ షో నిర్వహించిన కేటీఆర్ పై పోలీసు అధికారులు వెంటనే పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేస్తే ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ పై నమ్మకం ఏర్పడుతుందని ఉషాబాయ్ అభిప్రాయపడ్డారు. రాజా సింగ్ దేశం కోసం, ధర్మం కోసం కష్టపడి పని చేసే వ్యక్తి అని ఆమెన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తూ సొంత రాజకీయ లబ్ధి కోసం ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ప్రజల్లో బీజేపీ పై పెరుగుతున్న ఆదరణ చూసి కేసిఆర్ ఆందోళన చెందారు. అందుకే కేసీఆర్, కేటీఆర్, ఓవైసీ సోదరులు కలిసి ఈ కుట్ర చేశారు. రాజాసింగ్ ఒక హిందుత్వ లీడర్ రాజసింగ్ ఎప్పుడూ హిందుత్వం గురించి మాట్లాడతారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రాజాసింగ్ ను హిందువులు ఆదరిస్తున్నారు. కేవలం హిందూ జాతిని అవమానించడానికి ఇంత పెద్ద కుట్రకి తెర లేపారు.