PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCOS New Name: మహిళల్లో సాధారణంగా కనిపించే హార్మోన్ల సమస్యలలో ఒకటైన పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) కు త్వరలో కొత్త పేరు వచ్చే అవకాశాలపై వైద్య రంగంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సమస్యను ప్రధానంగా అండాశయాలకు (Ovaries) సంబంధించిన వ్యాధిగా భావించినప్పటికీ, తాజా పరిశోధనల నేపథ్యంలో నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇది కేవలం గైనకాలజీ సమస్య మాత్రమే కాదని.. శరీరంలోని హార్మోన్లు, మెటబాలిజంపై కూడా ప్రభావం చూపే సంక్లిష్ట సమస్యగా గుర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో “పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్” (Poly Endocrine Metabolic Syndrome – PMO/PEMS) వంటి కొత్త పేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే PCOS అనే పదం చాలాసార్లు తప్పుదారి పట్టించేలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా PCOS ఉన్న ప్రతి మహిళలో అండాశయాల్లో సిస్టులు కనిపించవు. అదే సమయంలో కొందరిలో స్కాన్‌లో పాలీసిస్టిక్ ఓవరీస్ కనిపించినా, పూర్తి స్థాయి సిండ్రోమ్ లక్షణాలు ఉండకపోవచ్చు.
Also Read
వైద్యుల వివరాల ప్రకారం.. ఈ సమస్యలో అసమాన అండోత్సర్గం (Irregular Ovulation), అధిక ఆండ్రోజెన్ హార్మోన్లు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, బరువు పెరగడం, మొటిమలు, అధిక రోమాల పెరుగుదల, నెలసరి అసమానతలు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి దీనిని కేవలం ఓవరీలకు పరిమితం చేయడం సరైంది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. చాలామంది మహిళలు దీన్ని సాధారణ గైనకాలజీ సమస్యగా మాత్రమే భావిస్తున్నారని, కానీ దీని వల్ల దీర్ఘకాలికంగా మెటబాలిక్ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం వైద్య రంగంలో ఈ సమస్యను కేవలం రీప్రొడక్టివ్ డిజార్డర్‌గా కాకుండా, శరీరమంతా ప్రభావితం చేసే ఎండోక్రైన్, మెటబాలిక్ వ్యాధిగా చూస్తున్నారు. అందుకే PMO వంటి పేర్లపై చర్చ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే వ్యాధి పేరును మార్చడమే అసలు పరిష్కారం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మహిళల్లో ఈ సమస్యపై సరైన అవగాహన, సమయానికి నిర్ధారణ, హార్మోన్ల ఆరోగ్యంపై విద్య, చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మహిళలు PCOS సమస్యతో బాధపడుతున్నారు. సరైన జీవనశైలి, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, వైద్యుల సలహాలతో ఈ సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!