Babar Azam: పాపం పాకిస్థాన్‌కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మరో సంచలన నిర్ణయానికి తెరలేపనుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను తిరిగి పాకిస్థాన్ టీ20ఐ కెప్టెన్‌గా నియమించే యోచనలో బోర్డు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ జాతీయ జట్టు ఇటీవలి ప్రదర్శనలపై సుదీర్ఘ సమీక్ష జరిపిన పీసీబీ.. పొట్టి ఫార్మాట్లోనూ నాయకత్వ మార్పును తీసుకురావాలని భావిస్తున్నట్లు పాకిస్థానీ పత్రిక ‘డైలీ ఔసాఫ్’ ఓ నివేదికలో పేర్కొంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో టీ20 జట్టును నడిపిస్తున్న సల్మాన్ అలీ ఆఘా స్థానంలో బాబర్ మళ్లీ పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే షాన్ మసూద్‌పై వేటు వేసి, బాబర్ ఆజమ్‌కు టెస్టు జట్టు కెప్టెన్సీని పీసీబీ తిరిగి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీ20ల్లోనూ అతనికే బాధ్యతలు ఇవ్వాలనుకోవడం చూస్తుంటే.. అన్ని ఫార్మాట్లలోనూ దేశంలోని అత్యంత అనుభవజ్ఞుడైన లీడర్‌పైనే బోర్డు మళ్లీ పూర్తి నమ్మకం ఉంచుతున్నట్లు స్పష్టమవుతోంది.
త్వరలోనే అధికారిక ప్రకటన!
కెప్టెన్సీ మార్పుపై పీసీబీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. అయితే, రాబోయే అంతర్జాతీయ సిరీస్‌లు, భవిష్యత్తులో జరగబోయే ఐసీసీ ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని టీ20 జట్టును నడిపించడానికి బాబర్ ఆజమ్ వైపే బోర్డు మొగ్గు చూపుతోందని సదరు నివేదిక తెలిపింది. పాకిస్థాన్ తదుపరి టీ20 సిరీస్‌కు సంబంధించిన జట్టును ఖరారు చేసి, అంతర్గత చర్చలు ముగిసిన తర్వాతే దీనిపై పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ ఊహాగానాలపై బహిరంగంగా స్పందించకూడదని బోర్డు భావిస్తోంది. ఒకవేళ కెప్టెన్సీ పగ్గాలు బాబర్ చేతికి మారినప్పటికీ.. సల్మాన్ అలీ ఆఘా జట్టు ప్రణాళికల్లో కీలక సభ్యుడిగానే కొనసాగుతాడని తెలుస్తోంది. జట్టులో అతని పాత్ర ఎంతో విలువైనదని పీసీబీ భావిస్తోందని సమాచారం. అయితే.. మరోవైపు ఈ అంశంపై క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. పాపం పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను సైతం తయారు చేసుకునే సత్తా లేదని చమత్కరిస్తున్నారు. ఆ దేశంలో కొత్త కెప్టెన్ దొరకట్లేదా? అంటూ పోస్టులు పెడుతున్నారు.
Also Read
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
- MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
- Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
బాబర్ గత రికార్డులు ఇవే..
గతంలో బాబర్ ఆజమ్ మూడు ఫార్మాట్లలోనూ పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి, ముఖ్యంగా టీ20ల్లో అద్భుతమైన విజయాలను అందించాడు. అతని సారథ్యంలోనే పాకిస్థాన్ జట్టు 2021 టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు, 2022 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు, పాక్ టీ20 కెప్టెన్లలో అత్యుత్తమ విన్నింగ్ పర్సంటేజ్ (గెలుపు శాతం) కలిగిన రికార్డు కూడా బాబర్ పేరిట ఉంది. వైట్-బాల్ క్రికెట్లో పాకిస్థాన్‌కు అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా ఉన్న బాబర్ అనుభవం, లీడర్షిప్ క్వాలిటీస్, కెప్టెన్సీ ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యమే పీసీబీని మళ్లీ అతని వైపు తిప్పుకునేలా చేశాయి.
తాజావార్తలు
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!