World Cup 2023 Pakistan Squad: ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. నసీం షా ఔట్! ఊహించని ఆటగాళ్లకు చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Squad for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం వెల్లడించింది. పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ సారథ్యం వహించనున్నాడు. పాకిస్తాన్ జట్టులో ఇద్దరు ఊహించని ఆటగాళ్లకు చోటు దక్కింది. సెప్టెంబర్ 28 వరకు అన్ని జట్లకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే.
ఆసియా కప్ 2023లో గాయపడిన స్టార్ పేసర్ నసీం షా ప్రపంచకప్ 2023కి దూరమయ్యాడు. ఆసియా కప్ మధ్యలో వైదొలిగిన మరో స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్ మాత్రం చోటు దక్కించుకున్నాడు. రవూఫ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు పీసీబీ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే ఎవరూ ఊహించిన విధంగా పేసర్ హసన్ అలీ, స్పిన్నర్ ఉస్మా మీర్‌లకు పాక్ జట్టులో చోటు దక్కింది. నసీం షా స్ధానంలో అలీ ఎంపిక అయ్యాడు. రిజర్వ్ జాబితాలో మహ్మద్ హ్యారిస్, జమాన్ ఖాన్, అర్బర్ అహ్మద్‌లకు చోటు దక్కింది. ఆక్టోబర్ 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: IND vs AUS 1st ODI: మరో మూడు వికెట్లు.. అశ్విన్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
పాకిస్తాన్ జట్టు ఇదే:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ ఆఫ్రిది, ఉసామా మీర్.
రిజర్వ్ ఆటగాళ్లు:
మహ్మద్ హరీస్, జమాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!