PBKS VS LSG: లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో భారీ షాక్!
- లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్
- ఎల్ఎస్జీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠిపై బీసీసీఐ చర్యలు
- మ్యాచ్ ఫ్రీజులో 25 శాతం జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటమి బాధలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎల్ఎస్జీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠిపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. యానిమేటెడ్ నోట్‌బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నందుకు గాను దిగ్వేష్ మ్యాచ్ ఫ్రీజులో 25 శాతం జరిమానాను విధించింది. అంతేకాదు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చింది. దిగ్వేష్ తన తప్పును ఒప్పుకోవడంతో బీసీసీఐ జరిమానాతో సరిపెట్టింది.
Also Read: IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు దక్కని చోటు!
Also Read
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా ఎల్ఎస్జీ 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఆపై లక్ష ఛేదనలో మూడో ఓవర్లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను దిగ్వేశ్ రాఠి ఔట్ చేశాడు. పెవిలియన్ వైపు వెళుతున్న ప్రియాంశ్ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి.. వెస్టిండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ తరహాలో నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. వెంటనే దిగ్వేశ్‌ను ఫీల్డ్ అంపైర్ మందలించాడు. మ్యాచ్ అనంతరం అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
DIGVESH RATHI DROPS AN ABSOLUTE BANGER CELEBRATION. 🤣❤️pic.twitter.com/kJWRa0xWtM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2025
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్‌కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!