యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాలో బోల్డ్ సీన్స్ చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సొగసరి. పాయల్ ఇటీవలే ‘మంగళవరం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Also Read: Kangana Ranaut: బాబోయ్.. రాజకీయాలకంటే సినిమాలు చాలా ఈజీ.. హీరోయిన్ కామెంట్స్..
ఇకపోతే ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. నేను నా ప్రియమైన వారి కోసం అన్ని ఆదివారాలు విడివిడిగా గడుపుతాను. ఆయన కలిస్తే నేనూ అలాగే చేస్తాను. ప్రభాస్ కోసం లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అతను ఏది అడిగినా నేను చేయాలనుకుంటున్నాను.
రాజ్మా అన్నం నాకు ఇష్టమైన ఆహారం. ప్రత్యేకంగా సిద్ధం చేసి నా చేతులతోనే ప్రభాస్ కి తినిపిస్తాను.. అవకాశం వస్తే మాత్రం అసలు వదులుకోను అంటూ తెలిపింది. నా కోరిక ప్రకారం.. నేను నా స్వంత చేతులతో ప్రతిదీ చేస్తాను అంటూ ఆమె చెప్పింది. ప్రస్తుతం పాయల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుండగా, డార్లింగ్ అభిమానులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు.