జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి.. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదు.. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రజా ఉపయోగ అంశాలపై బలంగా మాట్లాడాలి.. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
Read Also: NTR : గోవాకు వెళ్తున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
కులాలు, మతాల గురించి మాట్లాడాల్సినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం, చర్చి, మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి.. ముఖ్యంగా టీవీ చర్చలకు వెళ్లే వారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలపై లోతుగా అధ్యయనం చేయండి అని ఆయన అన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదు.. సోషల్ మీడియాకు అనవసరమైన ఇంటర్వూలు ఇవ్వొద్దు.. వాటివల్ల కొన్నిసార్లు లేనిపోని అనుమానాలకు తావిచ్చే ప్రమాదం ఉంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కి బాలిస్టిక్ మిస్సైల్ టెక్నాలజీ అందించిన చైనా.. 3 కంపెనీలపై యూఎస్ నిషేధం..
అదే విధంగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక సమాచారాన్ని నిర్ధారించుకోకుండా మరొకరికి పంపడమో, దానిపై హడావిడి చేయడమో వద్దు అని పవన్ చెప్పారు. పార్టీ ప్రతినిధిగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టవద్దు.. పార్టీ ప్రతినిధులు కేవలం పార్టీ కోసం మాత్రమే మాట్లాడాలి.. నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా స్పందించవద్దు.. అలా స్పందించుకుంటూ వెళ్తే మన లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది.. జీరో బడ్జెట్ రాజకీయాలనే అంశం మీద నేను అభిప్రాయాలు చెప్పలేదు.. అదెలా పుట్టిందో తెలియదుగాని నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ఆయన ప్రచారం చేశారు..
Read Also: Kaleru Venkatesh: ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన అంబర్పేట శంకర్ ముదిరాజ్
ఓట్లను నోట్లతో కొనే వ్యవస్థను మార్చే విధానం గురించే నేను మాట్లాడాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేగానీ ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలకు మంచినీళ్లు, టీ కూడా ఇవ్వకుండా పని చేయించుకోవడం గురించి కాదు.. ఈ వ్యవస్థలో మార్పు ఇప్పటికప్పుడు సంభవిస్తుందని అనుకోవడం లేదు.. రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. మన పార్టీ కమ్యునిస్టులతో కలసినా, బీజేపీతో కలసినా, టీడీపీతో పొత్తు ఉన్నా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే విషయాన్ని చర్చల్లో అవసరం అయిన సందర్భాల్లో ప్రస్తావించాలి అని ఆయన తెలిపారు.
Read Also: NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..
ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికీ నేను వ్యతిరేకం కాదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా వారు నన్ను దూషించినా శత్రువుగా పరిగణించను.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు కలవాల్సి వస్తుందో కూడా మనం చెప్పలేం.. ఒక్కోసారి మన ప్రత్యర్ధి పార్టీ నాయకుల్ని కూడా కలవాల్సిన సందర్బాలు కూడా రావొచ్చు.. అందువల్ల చర్చల్లో పాల్గొనే వారు కూడా సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేసి, చర్చలు ముగిశాక మంచిగా పలుకరించుకునే వాతావరణం ఉండాలి.. వచ్చే నెలలో ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేస్తాం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.