Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్‌పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ !

Pawan Kalyan, Surender Reddy, Imanvi,

Pawan Kalyan, Surender Reddy, Imanvi,

యూట్యూబ్ సెన్సేషన్, పాపులర్ డ్యాన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. ఇప్పటికే ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన ఈ భామ, ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం అందుకున్నట్లు సమాచారం. అతి తక్కువ సమయంలోనే ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్లతో జతకట్టే లక్కీ ఛాన్స్ ఆమెకు దక్కిందని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Also Read : Upasana Konidela : డెలివరీ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన ఉపాసన..

సురేందర్ రెడ్డి తన సినిమాలను అత్యంత స్టైలిష్‌గా, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తారు. పవన్ కళ్యాణ్ కోసం వక్కంతం వంశీతో కలిసి ఆయన ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ఘనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ తాళ్లూరి తన ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల నేపథ్యంలో, ఆయన కాల్షీట్లకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఇదే నిజమైతే, 2027 సంక్రాంతి బరిలో ఇప్పటికే ఉన్న ఇతర సీనియర్ హీరోల సినిమాలతో పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద తలపడటం ఖాయం.