NTV Telugu Site icon

Pawan Kalyan: కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి.. పాలకొండను బంగారు‌కొండ చేస్తాం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan, Janasena, Varahi Vijaya Yatra, Palakonda, AP Elections 2024, Andhra Pradesh, Telugu NewsPawan Kalyan:సిక్కోలు యువత భగభగ మండే నిప్పుకణికలని.. తెగించి పోరాడాలని.. 1960లో బామిని మండలంలోదోపిడీదారుల దాష్టీకాలు తట్టుకోలేక ఉత్తరాంధ్ర యువత తిరగబడిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ గుర్తు చేశారు. ఆరోజులు మళ్లీ వస్తాయని జగన్‌కు చెప్పాలన్నారు. గ్రామం.. సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని.. తప్పు జరిగినప్పుడు ఎదురించకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుందన్నాపు. జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు.. అన్యాయం జరిగినప్పుడు తిరగబడాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర యాస అంటే తనకు ఎంతో ఇష్టమని.. తన చిత్రాల్లో పాటలు కూడా ఉన్నాయన్నారు.

జగన్‌ సిద్ధం సిద్ధం అంటున్నారు.. దేనికి‌ సిద్ధమని పవన్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేవు , మద్యం రేట్లు పెంచారన్నారు. గిరిజన‌ యువతికి ట్రైకార్ నిధులు లేవన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. రంగుల పిచ్చిలో దాదాపు 2 వేల కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత ఆయన విమర్శించారు. అందులో రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్‌ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు.

Read Also: Tirumala: తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం

పాలకొండ డివిజన్‌లో ఏనుగుల బెడద అధికంగా ఉందని.. ఆస్తి , ప్రాణ నష్టం వాటిల్లుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక గజరాజులతో జరిగిన నష్టానికి పరిహారం అందిస్తామని పవన్ హమీ ఇచ్చారు. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందిస్తామన్నారు.పదవీ విరమణ తరువాత ఉద్యోగులు భయపడకూడదని.. సీపీఎస్ లేదా తత్సమాన పరిష్కారం అందిస్తామన్నారు. ఉద్యోగులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఉద్దానం‌ కిడ్నీ సమష్యలకు సంపుర్ణ పరిష్కారం వచ్చేంత వరకూ కృషి చేస్తామన్నారు. జగన్‌కు‌ ఒక్క ఛాన్స్ ఇచ్చారు సరిపోదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలను కోరారు. పాలకొండను బంగారు‌కొండ చేసుకుంటామన్నారు. దశాబ్దం తరువాత ఆభ్యర్థిస్తున్నా , అర్థిస్తున్నా , కూటమి అభ్యర్దులను‌ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.