Pawan Kalyan Said I felt happy about losing the 2019 elections: తాను 21 సంవత్సరాల వయసులోనే రాజకీయ ఆలోచనలు మొదలుపెట్టాను అని, అప్పుడే కమ్యూనిజం చదివాను అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఆనందంగా ఫీల్ అయ్యాను అని, ఆ భగవంతుడు కష్టాలు ఎలా ఉంటాయో తనకు చూపించాడన్నారు. ఏ పని ఎందుకు చేస్తానో తన కారణాలు తనకు ఉంటాయని, కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తాను తీసుకోగలను అని తెలిపారు. సినిమా వలనే తాను ఇంత మందికి చేరువయ్యాను అని పవన్ స్పష్టం చేశారు. విశాఖలో ‘సేనతో సేనాని’ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో రోజు జనసైనికులు, వీర మహిళలతో పవన్ సమావేశం అయ్యారు.
జనసైనికులు, వీర మహిళల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘గత ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటే.. నేను మాటలు పోగేసుకుంటున్నాను. చూడటానికి నేను మీకు దూరంగా ఉన్నా. జనసేన పార్టీలో భావజాలం మన అందరినీ దగ్గర చేసింది. మొదట్లో ఉద్దానం సమస్య నాకు తెలియదు. కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఉద్దానం లాంటి సమస్య పరిష్కారం కావాలి అంటే సోషియో పొలిటికల్ కమిట్మెంట్ కావాలి. నా దృష్టికి ఏదైనా సమస్య వస్తే దాన్ని లాజికల్ ఎండ్ వరకు తీసుకెళ్తా. ఉద్దానం సమస్య పైనా అలాగే పని చేశాం’ అని చెప్పారు.
‘సినిమా వలనే నేను ఇంత మందికి చేరువయ్యాను. నేను ఎవరినీ కలవను అని అనుకుంటారు.. అది ఫిజికల్లీ ఇంపాసిబుల్. పార్టీ పెట్టిన కొత్తలో జనం తాకిడి.. ఓ సినిమా ఫంక్షన్ మాదిరి ఉండేది. నా భావాలేంటి, వీళ్లు ఇలా మీద పడిపోతున్నారేంటి అనుకునేవాడిని. జనం మీద పడడం నాకు పెద్ద అడ్డంకిగా మారింది. అన్నా మీకోసం కోసుకున్నాం, రక్తం చిందించాం అంటే అది మీ పర్సనల్. 2019 ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఆనందంగా ఫీల్ అయ్యాను. భగవంతుడు నాకు కష్టాలు ఎలా ఉంటాయో చూపించాడు. 2019లో చాలా అవమానకరమైన ఓటమి చెందాను. ఏ పని ఎందుకు చేస్తానో నా కారణాలు నాకు ఉంటాయి. కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోగలను’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Also Read: Robbery Case: అంతర్జాతీయ క్రికెటర్‌పై చోరీ కేసు, అరెస్ట్.. రెండు ప్రపంచకప్‌లు, 97 మ్యాచ్‌లు!
‘నా 21 సంవత్సరాల వయసులోనే రాజకీయ ఆలోచనలు మొదలుపెట్టాను, కమ్యూనిజం చదివాను. 2019లో ఓడిపోయినప్పుడు అందరూ నవ్వుతారని నాకు తెలుసు. ఓడిపోయాక మిగతా వారిని ట్రాక్లో పెట్టడానికి చాలా కష్టపడ్డాను. అవమానాలు పడేవాడు, ఆశలు గుండె నిండా నింపుకున్నవాడు ముందుకు వెళ్లలేడు. ఆశయాలు గుండెల్లో నింపుకుంటేనే ముందుకెళ్తారు. 2019 ముందు నాదెండ్ల మనోహర్ మాజీ స్పీకర్, జనసేన పీఏసీ చైర్మన్ మాత్రమే. కానీ ఇప్పుడు మంత్రి అయ్యారు, ఆ స్థాయికి మనం ఎదిగాం. జనసేన ఆడవాళ్లు పేరంటాలకు వచ్చేవారు కాదు, పోరాటాల కోసం ముందుకు వెళ్లేవారు. వీర మహిళలకు కత్తి స్వామి నేర్పించాలని అనిపిస్తుంది. ఒక్కోసారి క్లాసులు పెడదామని కూడా అనిపించింది’ అని జనసేనాని పవన్ చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. మధ్యాహ్నం జనసైనికులు, వీరమహిళలు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, కూటమి సహకారం వంటి అంశాలపై చర్చించి.. వారి వద్ద నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.