వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్నా నేపథ్యంలో.. వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి.
READ MORE: Justin Trudeau: కెనడా విలీనమంటూ ట్రంప్ వ్యాఖ్య.. లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదానికి కెనడా సహాయం
తిరుపతిలో టోకెన్ల పంపిణీలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఇలా జరగకూడదని కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ముందుగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. “వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు వెళ్తున్న భక్తులు, ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, త్రోపులాటలకు తావివ్వకుండా, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తితో దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
READ MORE: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?