NTV Telugu Site icon

Bolisetti Srinivas: పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారు..

Bolisetti Srinivas

Bolisetti Srinivas

Bolisetti Srinivas: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి వెళ్లారు. ముద్రగడ, బొలిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిశారు. ఆ తరువాత రెండు గంటలకే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడను కలిశారు. ఈ క్రమంలోనే ముద్రగడ జనసేనలో చేరడం ఖరారైంది. పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

Read Also: Malla Reddy: పార్టీ ఆదేశిస్తే ఎంపీ బరిలో ఉంటా.. మల్లారెడ్డి మనసులోని మాట..

పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ఈనెల 20 లేదా 23న పవన్ ముద్రగడ దగ్గరకివస్తారని, ఆయనతో సమావేశమవుతారని తెలిపారు. ఉద్యమ నాయకుడిని నేను వచ్చే ఆహ్వానిస్తే గౌరవంగా ఉంటుందని పవన్ చెప్పారన్నారు. జనసేనలో చేరడానికి ముద్రగడ పద్మనాభం అంగీకరించారన్నారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లనని క్లారిటీగా చెప్పారన్నారు. ఇప్పుడు ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి తరువాత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని కూడా సమాచారం. ముద్రగడ ఏ పార్టీలోకి చేరతారనేది సంక్రాంతి తరువాతే క్లారిటీ రానుంది.