Malla Reddy: పార్టీ ఆదేశిస్తే ఎంపీ బరిలో ఉంటా.. మల్లారెడ్డి మనసులోని మాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి తమ మనసులోని మాటలను బయటపెట్టారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. తాజా గోవాలో చిల్ అవుతూ కనిపించిన ఆయన సంక్రాతి పండుగ సందర్బంగా బోయినపల్లిలో పతంగుల పంపిణి చేశారు. పతంగులు ఎగరవేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని పిల్లలకు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశిస్తే ఎంపీ బరిలో నిలుస్తా అని సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదని అన్నారు. అభివృద్ధి అంటే కేసీఆర్,కేటీఆర్ మాత్రమే అన్నారు. 21న జరిగే పార్లమెంట్ పరిధి సమావేశంలో అభ్యర్థి విషయం అధిష్టానం ఆలోచిస్తుందన్నారు. బోయిన్పల్లి లో జరిగిన కైట్ ఫెస్టివల్ లో మల్లారెడ్డి పాల్గొని పతంగులు ఎగురవేశారు. పిల్లలతో సరదాగా కాసేపు గడిపారు.
Also Read
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మల్లారెడ్డి మంత్రి పదవి కూడా పోయింది. ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్న మల్లారెడ్డి కాస్త విశ్రాంతి కోసం తాజాగా గోవా పర్యటనకు వెళ్లారు. ఎంచక్కా గోవా బీచ్‌లో ఎంజాయ్ చేశారు. సముద్ర బోటింగ్‌కు వెళ్లారు. పారాగ్లైడింగ్ కూడా చేశారు. అంతేకాదు.. స్వయంగా సముద్రంలో బోటు నడిపి అందరికి ఉత్సాహపరిచారు. మల్లారెడ్డి కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుని సరదాగా బోటు నడిపారు. మల్లారెడ్డి జోష్ లో వున్ను వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మల్లారెడ్డి వినోదాన్ని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మల్లారెడ్డి తీరు వేరు. మరికొందరు మల్లారెడ్డి డైలాగులను అనుకరిస్తూ వ్యాఖ్యలు చేశారు. మల్లాన్నా మజాకా అంటూ కామెంట్ లు చేశారు. అయితే గోవాలో చిల్ అనంతరం హైదరాబాద్ కు వచ్చిన మల్లారెడ్డి.. ఇవాళ సంక్రాంతి సందర్భంగా చిన్నపిల్లలకు పతంగులు పంచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ టికెట్ పై మల్లారెడ్డి మాట్లాడటంతో సంచలనంగా మారింది. మరి మల్లారెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ పై స్పందిస్తుందా? అనే విషయం ఉత్కంఠంగా మారింది.
Devil : ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!