NTV Telugu Site icon

Pawan Kalyan: సలహాలు ఇచ్చే వాళ్లొద్దు.. మద్దతివ్వాలని జనసైనికులకు పవన్ సూచన

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కి 2024ఎన్నికల్లో యుద్ధం ఇద్దామంటూ జనసైనికులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, అంగన్వాడి, ఉద్యోగులు అందరినీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ రోడ్లు పై పాలు పోస్తే తిరిగి గిన్నెల్లో ఎత్తుకోవచ్చని, చదువుకున్న వాళ్లకు ఎక్కడపడితే అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ వైసీపీ నాయకులు పగటి కలల్లో ఉన్నారని పవన్‌ ఎద్దేవా చేశారు. రోడ్లపై తిరుగుతుంటే రోజులు గడిచిపోతున్నాయన్నారు. OG లో వచ్చిన డబ్బులతో కేజీ బియ్యం కొనకుండా హెలికాఫ్టర్‌కు పెడుతున్నానని పవన్‌ చెప్పారు. ఐదు కోట్ల ప్రజలను ఐదుగురికి తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. వచ్చే 45రోజుల్లో వైసీపీ గుండాలు కూటమి కార్యకర్తలను బెదిరిస్తే మక్కెలు ఇరగొట్టి మడత మంచంలో పెడతానని హెచ్చరించారు. ఎక్కడికి వెళ్ళినా ఐదుగురు పెత్తనం చేస్తున్నారని.. ఇది క్లాస్ వార్ అని జగన్ అంటున్నారన్నారు. 2014పార్టీ పెట్టిన నాటి నుంచి తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర, దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రాజకీయాల్లో సహకారం, సంగ్రామం రెండు ఉంటాయి.. 2024లో జనసేన సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం బతుకు నాకు తెలుసు.. ఇప్పటివరకు సీఎం ఏమేమి చేశారో తనకు తెలుసన్నారు.

Read Also: Chandrababu: ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం..

ఎస్సీలు, ఎస్టీలు అందరినీ మోసం చేస్తున్నారని.. అందుకే పొత్తు నేనే ప్రతిపాదించానన్నారు. రాజధాని అంటే మూడు చోట్లకు పరిగెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుంది అని తాడేపల్లిగూడెం వేదికగా చెబుతున్నానన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతూ దానకర్ణులుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.నేను ఉన్నది యువతకి 10కేజీల బియ్యం, ఐదువేల బృతి ఇవ్వడానికి కాదు, పాతికేళ్ల భవిషత్తు ఇవ్వడానికి అని పవన్‌ అన్నారు. యువతలో ఏ కులం ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు తప్ప ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో చూడటం లేదన్నారు. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా.. యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని పవన్‌ చెప్పారు. పొద్దున్న పథకాలు కింద డబ్బులు ఇస్తూ సాయంత్రం సారా పేరుతో తీసుకుపోతున్నారన్నారు. పొత్తులో 24సీట్లు తీసుకుంటే ఇంతేనా అంటున్నారని.. ఎన్నికలు అయ్యాక తెలుస్తుందని… నెత్తిపై కాలు వేసి తొక్కుతామన్నారు. అంకెలు లెక్క పెట్టొద్దని చెప్పండి.. పవన్ , జనసేన వైపు చూసే దైర్యం చేయకండన్నారు. ఇప్పుడే ఇటుక ఇటుక పేర్చుతున్నామన్నారు.

Read Also: Political parties income: పొలిటికల్ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్.. 6 జాతీయ పార్టీ వివరాలు..

సలహాలు ఇచ్చేవాళ్ళు అవసరంలేదు.. మరిగే రక్తం ఉన్న యువకులు కావాలన్నారు. జనసేనకు సలహాలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు.. పోరాటం చేసే యువకులు కావాలి.. తెగువ చూపే వీర మహిళలు కావాలన్నారు. నేను ఏమి చేయకపోయినా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ‘‘పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానన్న ఆయన.. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించిందన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందన్నారు. “దోపిడీలు, అన్యాయాలు చేయకపోయినా నన్ను నా వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారని.. నాతో నడిచేవాడే నావాడు.. నాతో ఉండాలి అనుకునేవాళ్లు నన్ను ప్రశ్నించకండి.. ఎక్కడినుంచి పోటీ చేసినా ఓడిన, గెలిచినా మీతోనే ఉంటా.. పవన్ కళ్యాణ్ తో స్నేహం చచ్చే దాకా.. పవన్ కళ్యాణ్ తో శతృత్వం అవతలి వాడు చచ్చేవరకు..” అని పవన్‌ కల్యాణ్ తెలిపారు.