సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కి 2024ఎన్నికల్లో యుద్ధం ఇద్దామంటూ జనసైనికులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, అంగన్వాడి, ఉద్యోగులు అందరినీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ రోడ్లు పై పాలు పోస్తే తిరిగి గిన్నెల్లో ఎత్తుకోవచ్చని, చదువుకున్న వాళ్లకు ఎక్కడపడితే అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ వైసీపీ నాయకులు పగటి కలల్లో ఉన్నారని పవన్…
తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు.