Pawan Kalyan : ఇక పై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్ యాత్ర చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ బస్ యాత్ర గత దసరాకు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే.. పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టని బస్ యాత్ర వాహనం ఇటీవల రెడీ కావడంతో ట్రయల్ రన్ చేసి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్. ‘వారాహి’ ఈజ్ రెడీ ఫర్ బ్యాటిల్ అంటూ నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి. అయితే.. జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎలక్షన్ బ్యాటిల్ కోసం రెడీ చేసుకున్న వారాహి వాహనం కలర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. వారాహి రంగు మిలటరీ రంగును పోలి ఉండటంతో వివాదం చెలరేగింది. దీన్నే టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నింబంధనలకు విరుద్ధంగా రంగులు వేశారని ఆరోపిస్తున్నారు.
Also Read :BRS Celebrations: బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడకలు.. నగరానికి కర్ణాటక మాజీ సీఎం
దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తన సినిమాలను అడ్డకున్నారని.. ఆపై విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. బలవంతంగా తనను విశాఖ నగరం నుంచి పంపించి వేశారని పవన్ పేర్కొన్నారు. మంగళగిరిలో సైతం తను కారులో వెళ్తుంటే అడ్డుకున్నారన్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న తనను ఆపేశారన్నారు. ఇప్పుడు వాహనం రంగు పైనా వివాదం చేస్తున్నారన్నారు. ఇక పై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా అని పవన్ ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!