Pawan Kalyan Wishes YS Jagan Mohan Reddy: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. “వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని పవన్ కల్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు.
READ MORE: Push-Ups on Railway Bridge: పైత్యం ముదిరిందా.. బ్రిడ్జిని పట్టుకుని కిందికి వేలాడిన యువకుడు..
కాగా.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 21, 1972లో జన్మించిన జగన్ పుట్టినరోజును ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఇప్పటికే గ్రామాల నుంచి నగరాల వరకు ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసి సంబరాలకు రంగం సిద్ధం చేశారు. కేక్ కటింగ్లతో అడ్వాన్స్ బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
READ MORE: <
రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కూడా జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రీల్స్, వీడియోలు, పాటలు, డైలాగ్స్‌తో వైసీపీ శ్రేణులు హడావుడి చేస్తున్నారు. డిసెంబర్ నెల ప్రారంభం నుంచే రోజూ అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధ్యక్షుడి పుట్టినరోజు కావడంతో వైసీపీ సోషల్ మీడియా మరింత యాక్టివ్‌గా మారింది.
శ్రీ వై ఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
– @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 21, 2025