Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pawan Kalyan Criticizes Congress Ap Bifurcation Amaravati Assembly Speech

Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు

Published Date :March 28, 2026 , 4:08 pm
By Suresh Maddala
  • కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు
  • అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు
  • విభజన నాటి పరిణామాలను గుర్తుచేసిన డిప్యూటీ సీఎం
Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ బాధ్యతగా విభజించలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకసారి చంద్రబాబును కలిశానని.. అప్పుడు ఒకే మాట చెప్పారని.. టెంట్ వేసుకునైనా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేద్దామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. అందుకోసమే 2014లో ఎలాంటి కండీషన్స్ లేకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు చేతిలో రాష్ట్రం ఉంటే బాగుంటుందనే సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్లుగా తెలిపారు.

‘‘వాస్తవంగా చెప్పాలంటే.. భూ సమీకరణ చేయడమంటే చాలా కష్టం.. చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది రాజధాని కోసం ఎలాంటి గొడవలు లేకుండా భూములు సేకరించారు. అంతేకాకుండా భూమిలిచ్చిన వారందరికీ న్యాయం చేశారు. ఇక 2019లో ప్రభుత్వం మారినప్పుడు రాజధానిపై ఎన్ని అభండాలు వేశారో అందరికీ తెలిసిందే. గత పాలనలో మహిళా రైతులను దారుణంగా కొట్టారని.. ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రాని ఆడవాళ్లంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. గత పాలనలో ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉండేదని.. చట్టసభల్లోనూ దాడులు జరిగేవని.. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకే రక్షణ లేదు.’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

‘‘రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లైనా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్‌ బాధ్యతగా వ్యవహరించలేదు. తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు అనే భావన మాకు ఎప్పుడూ లేదు. తెలుగు నేల అనే భావన ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి సరైన కార్యాలయాలు లేవు. చంద్రబాబు బలమైన ఆశావాది కాబట్టి.. ఆఫీసులు లేకపోయినా పనిచేశారు.’’ అని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati Capital Issue
  • Amaravati farmers issue
  • Andhra capital debate
  • Andhra Pradesh bifurcation
  • AP Assembly speech

తాజావార్తలు

  • Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు

  • Pakistan Cricket: పాక్‌ క్రికెట్‌కు ఘోర అవమానం.. ప్లేయర్లతో పాటు షాక్ ఇస్తున్న కామెంటేటర్లు..

  • Jayam Ravi: పెళ్లి కాలేదని చెప్పి ప్రియురాలితో గోవాలో ల్యాండ్ కొన్న స్టార్ హీరో?

  • PM Modi-Trump call: పీఎం మోడీ-ట్రంప్ మధ్య “ఇరాన్” చర్చ.. మధ్యలో ఎలాన్ మస్క్ ఎంట్రీ..

  • New Scheme In Telangana: తెలంగాణలో మరో కొత్త స్కీమ్ ప్రారంభం.. సీఎం చేతుల మీదుగా..

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions