స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?
- 2026 గెరిల్లా 450కి కొత్త “ఏపెక్స్” టాప్ వేరియంట్ లాంచ్..
- మరింత స్పోర్టీ రైడింగ్ అనుభూతి కోసం ప్రత్యేక డిజైన్..
- ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 Royal Enfield Guerrilla 450 Apex: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన గెరిల్లా రోడ్ స్టర్ బైక్ కు 2026లో కొత్త అప్డేట్ ను తీసుక వచ్చేసింది. ఇందులో భాగంగా గెరిల్లా 450కు కొత్త టాప్ వేరియంట్‌గా “ఏపెక్స్” మోడల్‌ను పరిచయం చేసింది. మెరుగైన టైర్లు, మార్చిన రైడింగ్ పొజిషన్‌తో ఈ కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. 2026 గెరిల్లా 450 ఏపెక్స్, సాధారణ గెరిల్లా 450తో పాటు అమ్మకాలకు అందుబాటులో ఉంటుంది. రెండు వేరియంట్లు మూడు ట్రిమ్ లలో లభ్యమవుతాయి.
పేరుకు తగ్గట్టుగానే “ఏపెక్స్” వేరియంట్ మరింత ఆగ్రెసివ్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450లో ముందు, వెనుక రెండింటిలోనూ 17 అంగుళాల చక్రాలు ఉంటాయి. ఏపెక్స్ వేరియంట్లో వీరెడెస్టీన్ సెంట్యూరో ఎస్టీ రోడ్ టైర్లు అమర్చారు. ఇవి సాధారణ మోడల్ లో ఉన్న సీయాట్ స్టీల్ రేడియల్ టైర్ల స్థానంలో వచ్చాయి. ఈ కొత్త టైర్లు రోడ్డుపై 8% మెరుగైన పట్టును, తడి రోడ్డుపై 17% ఎక్కువ పట్టును ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ వేరియంట్‌లో హ్యాండిల్‌బార్‌ను 56mm కిందకు, 57mm ముందుకు మార్చారు. దీంతో రైడింగ్ పొజిషన్ మరింత స్పోర్టీగా మారింది.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..
ఏపెక్స్ వేరియంట్ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. బాడీ రంగుకు సరిపోయే వెనుక సీటు కవర్ తో ఇది మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ఇక వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌లైట్‌పై కలర్ హుడ్ అందించారు. అయితే సాధారణ మోడల్ లో ఉండే ఫ్రంట్ ఫోర్క్ కవర్లు ఇందులో లేవు. దీంతో ఇది మరింత సింపుల్ లుక్ ను అందిస్తుంది.

సాధారణ గెరిల్లా 450లో కొత్త నీలం రంగు పెయింట్ స్కీమ్ ను జోడించారు. అంతే కాకూండా హెడ్ లైట్ గార్డులు, చేతి రక్షణ గార్డులు, ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్‌ను అందించారు. ఈ కొత్త 2026 గెరిల్లా 450లో ఇంజిన్, ఇతర సాంకేతిక భాగాలు యథాతథంగా ఉన్నాయి. 452 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 40 bhp, 40 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు గేర్‌ల ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
Mohsin Naqvi: పరువంతా పోయిందిగా మోహ్‌సిన్ నఖ్వీ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అంటూ గరం గరం..
ఇందులో ట్విన్ స్పార్ ఫ్రేమ్, షోవా సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు కూడా కొనసాగుతున్నాయి. స్ట్రీట్, స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. వృత్తాకార కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే కూడా కొనసాగించారు. ఇక నావిగేషన్, కనెక్టివిటీ వంటి ఫీచర్లను కాస్త మెరుగుపరిచారు. బైకు ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది.
The all-new Guerrilla 450 Apex. A lean, mean cornering machine recalibrated for urban geometry—with a torquey 40PS x 40Nm x 452cc engine that gives more growl for the prowl. #ApexMode #Guerrilla450 #GRRR #RoyalEnfieldStreet #RoyalEnfield #RidePure #PureMotorcycling pic.twitter.com/LRxkKUVzzT
— Royal Enfield (@royalenfield) March 27, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!