Pawan Kalyan: జనసేన నేత సాయిపై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్, రెండు చెంపలు వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. మీడియాలోనూ ప్రముఖంగా ప్రసారం అయ్యింది.. ఈ ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి సీఐ అంజూయాదవ్‌కు నోటీసులు జారీ చేసింది.. ఇక, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై చేయి పడితే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు తిరుపతికి వెళ్లారు.. సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి చేరుకున్నారు.. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి.. ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: Madhyapradesh: దారుణం..అప్పును ఇవ్వమన్నందుకు మామను ముక్కలుగా నరికిన అల్లుడు..
ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతలు చాలా క్రమశిక్షణతో ఉంటారు.. పోలీసులకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంటుంది.. దానిని ఒకస్థాయి వరకు అర్థం చేసుకుంటాం.. కానీ, ఇలా ప్రవర్తించడం మాత్రం సరికాదన్నారు.. ఇక, సుమోటోగా కేసు తీసుకున్న మానవ హక్కల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ, జనసైనికులు క్రమశిక్షతో ఉంటారు.. పోలీసులు అంత డిసిప్లెన్ లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి.. హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, తిరుపతి పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు పవన్ కల్యాణ్..