NTV Telugu Site icon

Pawan Kalyan : చదువు ఉద్యోగం కోసమే కాదు జ్ఞానం సంపాదించుకోవడానికి…

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ వ్యాప్తంగా శనివారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. రాయలసీమలో అత్యధికంగా గ్రంధాలయాలు ఉన్నాయి అందుకే నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నానన్నారు. నన్ను పిఠాపురానికే పరిమితం చేస్తారని, కానీ నేను సరస్వతికి నిలయమైన రాయలసీమను ఎంచుకున్నానని ఆయన అన్నారు. అన్నమయ్య, మొల్ల, పుట్టపర్తి నారాయణాచార్యులు,వంటి ఎందరో మహానుభావులు పుట్టిన నేల అని, రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు సాహిత్యానికి నిలయమైనటువంటి ప్రాంతమన్నారు పవన్‌ కల్యాణ్‌. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కేవలం గ్రామాలకే పరిమితమని, కడప ఎమ్మెల్యే మాటకు సమాధానం ఇచ్చారు పవన్. ఉద్యాన సమస్యను గతంలో మేము తీవ్రంగా ఎదుర్కొన్నానన్నారు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చినా ఇంకా నీటి సమస్య ఉందని చెప్పడం బాధగా ఉందన్నారు. పులివెందులలో తాగునీటి సమస్య కోసం 40 కోట్ల నిధులను విడుదల చేస్తామని, గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను పనులను కొనసాగిస్తున్నామన్నారు. కడప నగరంలో తాగునీటి సమస్య మౌలిక వసతులు సమస్య తీర్చడానికి కచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటామని, సమాజానికి సరైనటువంటి విద్యను అందించకపోతే అభివృద్ధి సూచికలోకి రాదని, విద్యార్థుల భద్రత మాదకద్రవ్యాల వినియోగం సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై పడుతోందన్నారు పవన్‌ కల్యాణ్‌.

Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే మాధవరం సీరియస్‌..

అంతేకాకుండా..’ఐపాడ్ ఇచ్చింది చదువుకు ఉపయోగపడాలని.. వాటిని వేరే వాటికి ఉపయోగించడం బాధ్యతారాహిత్యం.. విద్యార్థుల తల్లిదండ్రులు దీనికి బాధ్యత వహించాలి.. విద్యార్థులు మేము క్రికెట్ ఆడాలి అనుకుంటుంటే గ్రౌండ్ మాకు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు.. రాయచోటిలో విద్యార్థులు గొడవ చేస్తూ ఉంటే మందలించిన ఆ ఉపాధ్యాయుడు మృత్యువాత పడ్డాడు… చదువు ఉద్యోగం కోసమే కాదు జ్ఞానం సంపాదించుకోవడానికి… మనం భారతీయులం అని మరిచిపోకూడదు… ప్రీతి అనే బాలిక స్కూల్ కెళ్ళి పాఠశాలలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందింది… ఇటువంటి ఘటనలను మా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది.. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి.. ప్రభుత్వం ఇచ్చిన టాబ్స్ ను అవసరానికి వాడుతున్నారా లేదా, అవసరానికి మించి వాడుతున్నారా అన్నదానిని తల్లిదండ్రులు గమనించాలి… ప్రభుత్వ పాఠశాలలు బలపడాలి… కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగిస్తే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలను గీటుగా అభివృద్ధి చేయవచ్చు… విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు అన్ని అంశాల పైన సమగ్ర అవగాహన ఉండాలి…. స్కూల్స్ పై తల్లిదండ్రులు వచ్చిన తేవాలి… తీరిన సమస్యను తీర్చే బాధ్యత పై మేము దృష్టిపెడతాం… మధ్యాహ్న భోజన పథకం పై నేను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తా… పౌష్టిక ఆహారం అందడం లేదు పిల్లల దేహదారుడ్య సరిగా లేదు…

Narayana Murthy: కింగ్‌ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?

డ్రగ్స్ ఇంత క్రింది స్థాయికి వెళ్ళాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన పవన్… విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలి… 16 ఏళ్ల వయసు వచ్చేవరకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదు… అధ్యాపకులు అంటే నాకు చాలా గౌరవం… ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలని తల్లిదండ్రులు చూసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు.. 50 మంది విద్యార్థులను అధ్యాపకులు చూసుకోవడం ఇంకెంత కష్టంగా ఉంటుందో.. దేశం బాగుపడాలంటే కాంట్రాక్టర్లు కాదు పెట్టాల్సింది పెట్టుబడులు ఉపాధ్యాయులపై పెట్టాలి.. విలువలతో కూడిన అధ్యాపకులు ఉంటే ఈ దేశం ఎంతో ముందుకు వెళుతుంది.. ఉపాధ్యాయులకు కూడా పోషకాహారం అవసరం… ఈ దేశం బాగుండాలి అంటే అత్యధిక జీతాలు ఉపాధ్యాయులకు ఇవ్వాలి… నేను చెన్నైలో చదువుకునే సమయంలో ఓ టీచర్ చెప్పింది ఎదుటివారి కష్టాన్ని దోచుకోవద్దని.. వెంకట్రామయ్య అనే మాస్టర్ చెప్పిన పాఠాలు నాకు గుర్తు ఉండిపోయాయి… మా అమ్మ ప్రతిరోజు సాయంత్రం లైట్లు వేసి దండం పెట్టేది… ఎవరికి అమ్మ నువ్వు దండం పెడుతున్నావు అని నేను అడిగేవాడిని.. అడిగి కనుక్కున్న థామస్ అల్వా ఎడిషన్ కు నేను దండం పెడుతున్నాను నాయనా అని చెప్పేది.. మీరు ఎలా ఆలోచిస్తే అదే చేస్తారు.. విలువలు పాటించే వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి… నా హీరోలు నా టీచర్స్.. నా సినిమాలో రీ రికార్డింగ్స్ ఉంటాయి.. నిజమైన హీరోలకు రీ రికార్డింగ్స్ ఉండవు.. కార్గిల్లో మనకోసం చనిపోయిన వారికి రి రికార్డింగ్స్ ఉండవు.. వీదులను శుభ్రపరిచే మన కుటుంబం అది… నా చేత మా అమ్మానాన్న బాత్రూంలు కడిగించారు.. ప్రతి విద్యార్థి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి.. శానిటేషన్ సిబ్బంది అంటే నాకెంతో గౌరవం.. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి.. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులు, ప్రాణాలర్పిస్తున్న పోలీసులు వారిని ప్రేరణగా తీసుకోవాలి’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.