Pawan Kalyan : ఏపీ వ్యాప్తంగా శనివారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాయలసీమలో అత్యధికంగా గ్రంధాలయాలు ఉన్నాయి అందుకే నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నానన్నారు. నన్ను పిఠాపురానికే పరిమితం చేస్తారని, కానీ నేను సరస్వతికి నిలయమైన రాయలసీమను ఎంచుకున్నానని ఆయన…