Pawan Kalyan: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. ఇలా స్పందించిన పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. అనారోగ్య సమస్యల దృష్ట్యా.. నవంబర్ 24వ తేదీ వరకు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. ఇక, చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం కలగాలన్న ఆయన.. చంద్రబాబుకు హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం అన్నారు.. సంపూర్ణ ఆరోగ్యంతో.. ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం అంటూ రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.
కాగా, టీడీపీ అధినేతకు బెయిల్ రావడంతో.. సంబరాల్లో మునిగిపోయాయి టీడీపీ శ్రేణుల.. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్చారు.. స్వీట్లు పంచారు టీడీపీ నేతలు.. ఇక, బెయిల్ పత్రాలు అందిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు చంద్రబాబు.. ఆయన నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. హైకోర్టు షరతులకు లోబడి.. ఇంట్లో ఉంటూ.. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోనున్నారు చంద్రబాబు నాయుడు.
Also Read
- Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
శ్రీ @ncbn గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Hd1xjBsOCS
— JanaSena Party (@JanaSenaParty) October 31, 2023
తాజావార్తలు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!