కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ నుంచి బేగంపేట్ వరకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు.
మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కొత్తపేట, లింగోజిగూడ డివిజన్లలోని రాజీవ్ గాంధీ నగర్, భరత్ నగర్, శివమ్మ నగర్, ఆర్టీసీ కాలనీ, మసీద్ గల్లీ పరిసర కాలనీలో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మధు యాష్కీ గౌడ్, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్…
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో వేగాన్ని పెంచారు. మరో వైపు తల్లి గెలుపును కాంక్షిస్తూ ఆమె కూతురు మనీషా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్యుడ్ని దైవంతో పోలుస్తూ వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు నిజంగానే మరో దేవుడితో సమానం అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్కచేయక రోగులకు వైద్యం అందించడం గొప్ప విషయo అభినందనీయం అన్నారు. కూకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి…
శుక్రవారం రోజు కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పర్వతనగర్, వివేకానంద నగర్, తులసినగర్, గాయత్రి నగర్, జనప్రియ నగర్‌లో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేంధర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.. నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతలు చేరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.