NTV Telugu Site icon

Patnam Sunita Mahender Reddy: కూకట్పల్లి నియోజకవర్గంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం..

Patnam

Patnam

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికీ, ప్రతి వాడకు, బహిరంగ సభల్లో పాల్గొంటూ తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిన్నారు. తమ పార్టీ గెలిస్తే రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతుందని వివరిస్తున్నారు. ఈ సందర్భంగా.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

Inter Board : ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల

కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ నుంచి బేగంపేట్ వరకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు.

Shyamala Devi: ఏపీలో ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?

పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనను మల్కాజ్గిరిఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే.. ఎల్లవేళలా ప్రజల క్షేమం కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో మీ అమ్యూలమైన ఓటును చేతి గుర్తుకు వేసి గెలిపించాలని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మంచి జరుగుతుందని అన్నారు. మీ అందరి అభివృద్ధికి మరోసారి తోడుపడేలా అవకాశం ఇవ్వగలరని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని తెలిపారు.