Site icon NTV Telugu

Pat Cummins : వరుస ఓటములతో భారత్ విడిచి వెళ్తోన్న ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్.. ఈ వార్తలో నిజమెంత?

Pat Cummins

Pat Cummins

ఐపీఎల్ 2025 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్ లేదా కమిన్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పాట్ భార్య బెక్కీ కమ్మిన్స్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాలుగా మొదలయ్యాయి. కమిన్స్‌తో కలసి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన బెకీ.. దీనికి గుడ్‌బై ఇండియా.. ఈ అందమైన దేశాన్ని పర్యటించడం ఓ అద్భుతం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ పోస్టులో ప్యాక్ చేసిన సామానుతో పాటు భార్యాభర్తలిద్దరూ కనిపించారు.

READ MORE: R.S.Brothers : కనకదుర్గ సన్నిధిలో ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ 2వ షోరూమ్‌.. ప్రారంభించిన కీర్తి సురేష్‌

కమిన్స్-బెకీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలను షేర్ చేయడం, గుడ్‌బై ఇండియా క్యాప్షన్ పెట్టడంతో వీళ్లు భారత్‌ని విదిలి ఆస్ట్రేలియాకు పయనమయ్యారనే వార్తలు చక్కెర్లు కొట్టాయి. వరుస ఓటముల వల్ల బాధతో కెప్టెన్ తిరిగి తన దేశానికి వెళ్తున్నాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీంను దగ్గరండి గట్టెక్కిస్తాడంటే ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటని అభిమానులు ఆగ్రహానికి, ఆందోళనకి గురయ్యారు.

READ MORE: MMTS Train Case : నేను చెప్పింది నిజమే.. అత్యాచారయత్నం కేసులో మరో ట్విస్ట్‌..

అయితే సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నుంచి దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లు సమచారం. ఈ క్లారిటీతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ మళ్లీ ఊపరి పీల్చుకున్నారు. ఈ సీజన్‌ మొత్తం కమిన్స్ అందుబాటులో ఉంటాడని.. ఎలాంటి సందేహం అవసరం లేదని మేనేజ్‌మెంట్ తెలిపింది. తన భార్య స్వదేశానికి తిరిగి వెళ్తుండగా.. ఆమెను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసేందుకు కమిన్స్ వెళ్లాడని క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version