పాస్తా.. ఈ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. ఒకప్పుడు ఈజీగా మ్యాగీని చేసుకొనేవారు.. కానీ ఇప్పుడు పాస్తాను ఎక్కువగా చేస్తున్నారు.. పాస్తాలో రకరకాల వెరైటీలను చేస్తున్నారు.. అందుకే పిల్లలు పెద్దలు అని వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తింటున్నారు.. అయితే ఈ రుచికరమైన పాస్తా మన శరీరానికి హాని చేస్తుందని చాలా మందికి తెలియదు. ఇది నిజమేనా కదా చాలా మంది సందేహిస్తున్నారు. ఎందుకంటే పాస్తా లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.ఇది మన శరీరానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుస్తుందాం..
పాస్తా పిండిని తయారు చేయడానికి ఉపయోగించే గోధుమ బయటి పొర అని నిపుణులు చెబుతున్నారు. అలా తయారు చేసిన పిండికి పాస్తా ఆకారాన్ని ఇవ్వడానికి నీటితో కలుపుతారు.కొన్ని దేశాలలో అయితే దురుమ్ గోధుమలు, గుడ్లు, నీటిని కలిపి పాస్తాను తయారు చేస్తారు.. పాస్తాను తినాలని అనుకుంటే మీరు దాన్ని వండటానికి గంట ముందు నానబెట్టాలి.. అప్పుడు అందులో ఉండే పిండి మొత్తం తొలగిపోతుంది.. కూరగాయలు వేసి ఉడికిస్తే చాలా మంచిది..
పాస్తాను తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం… పాస్తాలో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే శరీరంలో అనేక మార్పులు రావడం జరుగుతుంది.. పాస్తా తినడం వల్ల కొవ్వు శాతం పెరిగి ఉబకాయం వస్తుంది. ఇది అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది.. అలాగే మహిళలకు ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఎప్పుడూ పాస్తాను తినడం మంచిది కాదు.. నెలకు ఒక్కసారి చాలు.. అంతకు మించి తీసుకుంటే కోరి ప్రాణాలను డేంజర్ లో పడవేసినట్లే…