NTV Telugu Site icon

Telangana Elections 2023: లెక్క తేలింది.. సామాజిక సమీకరణాల లెక్కలేసుకుని పార్టీల టిక్కెట్లు

Telangana Elections

Telangana Elections

Telangana Elections 2023: తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో లెక్క తేలింది. మూడు పార్టీలు కూడా బడుగుల ప్రతినిధి తామేనని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లిందో తెలుసా?. ఎన్నికల్లో గెలవాలంటే ఏ ఒక్క వర్గమో ఓటేస్తే సరిపోదు. అందరి మద్దతు కావాల్సిందే. అందుకే అన్ని పార్టీలు కులాలను, వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి పార్టీ కూడా అన్ని వర్గాలకు తామే ప్రతినిధి అనే చెప్పుకునేందుకు పాట్లు పడ్డాయి. సీట్ల కేటాయింపులో సామాజిక సమతుల్యాన్ని పాటించేందుకు ప్రయత్నించాయి. అన్ని వర్గాలకు సాధ్యమైనంతగా అవకాశం ఇచ్చి, ఏ వర్గం కూడా తమకు దూరం కాకుండా చేసేందుకు భారీ కసరత్తు చేశాయి.

*కాంగ్రెస్ లెక్కలు ఇవే..
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుంటే.. కాంగ్రెస్ 118 చోట్ల పోటీ చేస్తోంది. ఒక్కస్థానాన్ని సీపీఐకి కేటాయించింది. తాము పోటీ చేస్తున్న 118 సీట్లలో 58 సీట్లను ఓసీలకు, 23 సీట్లను బీసీలకు, 19 సీట్లను ఎస్సీలకు, 12 సీట్లను ఎస్టీలకు, 06 స్థానాలు మైనారిటీలకు కేటాయించింది. ఓసీలకు కేటాయించిన 58 సీట్లలో రెడ్లకు 43, వెలమలకు 09, కమ్మలకు 03, బ్రాహ్మణులకు 03 స్థానాలను కేటాయించింది.
బీసీలకు కేటాయించిన స్థానాల్లో ఎవరికెన్ని..
మున్నూరు కాపు-05
గౌడ-04
ముదిరాజ్-03
యాదవ్-02
కురుమ-02
ఇతర బీసీలు 07

ఎస్సీల్లో ఎవరికెన్ని?
మాల -09
మాదిగ-10

ఎస్టీల్లో ఎవరికెన్ని?
లంబాడా-07
కోయ-04
గోండు-01

Also Read: Tula Uma: తుల ఉమ ఇంటికి క్యూ కడుతున్న నేతలు.. పార్టీలో చేరాలని కాంగ్రెస్ ఆహ్వానం!

*బీఆర్ఎస్‌ పార్టీ 
అధికార బీఆర్‌ఎస్‌ కూడా సామాజిక సమీకరణాల లెక్కలేసుకుని టికెట్లను కేటాయించింది.
మొత్తం 119 స్థానాల్లో ఎవరికెన్ని సీట్లు అంటే..?
ఓసీలు -60
బీసీలు-23
ఎస్సీలు-20
ఎస్టీలు-12
మైనారిటీలు-03
ఉత్తరాది-01

ఓసీల్లో ఎవరికెన్ని?
రెడ్డి-43
వెలమ-10
కమ్మ-05
బ్రాహ్మణ-01
వైశ్య-01

బీసీలకు కేటాయించిన స్థానాల్లో ఎవరికెన్ని..
మున్నూరు కాపు-09
గౌడ-04
యాదవ్-05
పద్మశాలి-01
ఇతర బీసీలు 05

Also Read: PM Modi: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు
*బీజేపీ పార్టీ

బీజేపీ పార్టీ మొత్తం 111 చోట్ల బరిలోకి దిగుతోంది.
మొత్తం 111 స్థానాల్లో ఎవరికెన్ని సీట్లు అంటే..?
ఓసీలు -44
బీసీలు-36
ఎస్సీలు-21
ఎస్టీలు-10

ఓసీల్లో ఎవరికెన్ని?
రెడ్డి-29
వెలమ-08
కమ్మ-03
బ్రాహ్మణ-02
వైశ్య-01
ఉత్తరాది-01

బీసీల్లో ఎవరికెన్ని?
ముదిరాజ్-09
మున్నూరు కాపు-07
యాదవ్-05
గౌడ-05
పెరిక-02
ఇతర బీసీలు-08

ఎస్సీల్లో ఎవరికెన్ని?
మాదిగ -14
మాల-07

 

బీజేపీ మిత్రపక్షం జనసేన తెలంగాణలో తాము పోటీ చేస్తున్న 8 స్థానాలకు గానూ.. రెండు ఎస్టీ, మూడు బీసీ, రెండు కాపు, ఒక ఓసీకి అవకాశం ఇచ్చింది. మరి పార్టీల కులాల లెక్కలు ఏ పార్టీకి ఓట్లు కురిపిస్తాయో.. ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తేలాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.