NTV Telugu Site icon

New Parliament: ఈ నెల 19 నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు..?

New Parliament

New Parliament

New Parliament: కేంద్రం ఈ నెల 18-22 వరకు 5 రోజలు పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 19న కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. గణేష్ చతుర్థి నాడు సభ పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కి మారుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది మే 28న కొత్త పార్లమెంట్ ను ప్రధాని నరేంద్రమోడీ అట్టహాసంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. భవిష్యత్తులో సభ్యుల సంఖ్య పెరగినా అందుకు అనుగుణంగా నిర్మాణం జరిగింది.

Read Also: Woman and Goat Video: నిజాయితీకి మారుపేరులా ఉంది ఈ పెద్దావిడ.. ట్రైన్ లో ఏం చేసిందంటే?

ఇదిలా ఉంటే గత వారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ ప్రత్యేకసమావేశాలకు పిలుపునిచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎజెండాను ప్రకటించలేదు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’, మహిళా బిల్లు, ఇండియా పేరును భారత్ గా మార్చడం వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎజెండా ఏమిటనేది స్పష్టం తెలియదు.

Show comments