Woman and Goat Video: నిజాయితీకి మారుపేరులా ఉంది ఈ పెద్దావిడ.. ట్రైన్ లో ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Buys Train Ticket to her Goat: సాధారణంగా ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు కొంతమంది అస్సలు టికెట్ తీసుకోరు. డబ్బులు ఉన్నా కూడా పట్టుకున్నప్పుడు చూద్దాంలే అన్నట్లు కొందరు టికెట్ కొనకుండానే ప్రయాణిస్తుంటారు. ఇక మరి కొందరు వారితో పాటు పిల్లల్ని తీసుకువచ్చేటప్పుడు కూడా హాఫ్ టికెట్ కొనాల్సి ఉండి కూడా కొనరు. పిల్లల వయసును తక్కువ చెబుతూ ఉంటారు. కొన్ని డబ్బులు చెల్లించి టికెట్ కొనే విషయంలో కూడా నిజాయితీగా ప్రవర్తించరు. అలా చాలా మంది టికెట్ ఎగ్జామినర్స్ వచ్చినప్పుడు దొరికిపోయి ఫైన్ లు కడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ పెద్దావిడ ఎంతో నిజాయితీగా ప్రవర్తించింది. ఆమెతో పాటు తీసుకువెళుతున్న మేకకు కూడా టికెట్ తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Bear and Tiger Viral Video: పులిని ఫాలో అయిన ఎలుగుబంటి.. అది తిరిగి చూసే సరికి ఏం చేసిందంటే?
Also Read
ఆ వీడియోను డి ప్రశాంత్ నయ్యర్ అనే యూజర్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. “ఈవిడ ట్రైన్ లో ప్రయాణిస్తున్నందకు తనతో పాటు తన మేకకు కూడా టికెట్ తీసుకుంది. టికెట్ ఎగ్జామినర్ అడుగుతున్నప్పుడు ఆమె నిజాయితీతో ఎంత గర్వంగా సమాధానం చెబుతుందో చూడండి” అంటూ కాప్షన్ జోడించారు. ఇక ఈ వీడియోలో టికెట్ కలెక్టర్ వచ్చి ఓ పెద్దావిడని టికెట్ అడుగుతాడు. ఆవిడ ఆమెతో పాటు వచ్చిన ఒకతన్ని టికెట్ చూపించూ అని అడుగుతుంది. అది చూసిన టికెట్ టీఈటీ ఏంటి మేకకు కూడా టికెట్ తీసుకున్నారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. అందుకు ఆ మహిళ చిరునవ్వుతో అవును సార్ అంటూ సమాధానం ఇస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె నిజాయితీకి మారుపేరులా ఉందంటూ కొనియాడుతున్నారు. తమ కోసమే టికెట్ తీసుకోవడానికి ఆలోచించే ఈ కాలంలో ఆమె మేకకు కూడా టికెట్ తీసుకోవడం సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Got this video in WA
This lady is taking her goat in the train..and she bought a ticket for the goat.
Look at her pride in her own honesty when she replies to the ticket collecting officer pic.twitter.com/2Du1Gq8a6o— D Prasanth Nair (@DPrasanthNair) September 5, 2023
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?