టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలు బయట పెడితే అందులో ఫేక్ అని చెబుతున్నారు. అక్రమాలు బయట పడినా జనాల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు.అక్కడికి వెళ్లి వాస్తవాలు సర్వే చేపించుకోవచ్చు కదా… ఆక్రమణలో ఉన్న వాటిని వదిలేయ్ వచ్చు కదా. నీ పక్కన వాళ్ళు తప్పు చేస్తే నువ్వే చెప్పుతో కొట్టాలి.లోకేష్ వాకింగ్ గురించి ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడడం కంటే ఆయన గుడ్ మార్నింగ్ లు, వాకింగ్ లపై చాలా మంది మాట్లాడుతున్నారు.
Read Also:IPL2023 : సీఎస్కే మ్యాచ్ తో మ్యాచ్.. సచిన్ తనయుడు అరంగేట్రం నేడే..!
కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని కామెడీగా మాట్లాడాల్సిన అవసరం లేదు.ధర్మవరం ఎమ్మెల్యే కులాల మధ్య చిచ్చు పెట్టి ఓ వర్గానికి నన్ను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పదే పదే లోకేష్ గురించి మాట్లాడుతున్నావ్.గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పడం ఎవరికైనా అలవాటు. అందుకే ఎన్టీఆర్ పేరు చెబుతున్నారుజ పరిటాల రవి పేరును పదే పదే నువ్వు చెబుతున్నావు. మంచికి అనుకుంటే బాగుంటుంది. చెడుకు అనుకుంటే అది ఎక్కడికో తొక్కుతుంది… అది నీకు మంచిది కాదు. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి కి…. కూడా ఆల్ ది బెస్ట్ అన్నారు పరిటాల శ్రీరామ్.
Read Also: Konda Vishweshwar Reddy: ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించ లేదు