Paris Olympics 2024: ఎవరు ఈ సరబ్జోత్ సింగ్.?
- పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్ జోడి మను భాకర్ & సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఈ జంట 16-10తో దక్షిణ కొరియాని ఓడించింది.
- సరబ్జోత్ అంబాలాలోని ధీన్ గ్రామ నివాసి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024 Sarabjot Singh: పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్ జోడి మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఈ జంట 16-10తో దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓహ్, వోన్హో లీ జోడీని ఓడించింది. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో మనుకి ఇది రెండో పతకం కాగా., సరబ్జోత్ తొలిసారి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇకపోతే సరబ్జోట్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. సరబ్జోత్ అంబాలాలోని ధీన్ గ్రామ నివాసి. అతని తండ్రి జతీందర్ సింగ్ ఒక రైతు. తల్లి హర్దీప్ కౌర్ గృహిణి. ఆయన చండీగఢ్ లోని DAV కాలేజీలో చదివాడు. కోచ్ అభిషేక్ రాణా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. సరబ్ జోట్ కు 12-13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వేసవి శిబిరంలో కొంతమంది పిల్లలు ఎయిర్ గన్ లను కాల్చడం చూశాడు. అప్పటి నుంచి అతను ఈ గేమ్ పై ఆసక్తి చూపాడు.
Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
2019లో సరబ్జోత్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 239.6 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆసియా ఛాంపియన్షిప్ 2023లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకోగా.. పారిస్ ఒలింపిక్స్ కోటా సాధించాడు. భోపాల్‌లో జరిగిన ISSF ప్రపంచ కప్ 2023లో వ్యక్తిగత ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. బాకులో జరిగిన 2023 ప్రపంచకప్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. టీమ్ ఈవెంట్‌లో 1 బంగారు పతకం, జూనియర్ ప్రపంచ కప్ 2022 మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో రజత పతకం గెలుచుకున్నాడు.
Rashid Khan: రషీద్ ఖాన్ @600 వికెట్లు..
సరబ్జోత్ తన మొదటి ఒలింపిక్స్‌లో ఆడుతున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో 577-16x స్కోర్‌తో 33 మంది అథ్లెట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అతను ఎనిమిదో స్థానంలో నిలిచిన జర్మనీకి చెందిన రాబిన్ వాల్టర్ ను పాయింట్లతో ఫైనల్ స్థానం కోల్పోయాడు. టాప్ 8 షూటర్లు మాత్రమే ఫైనల్స్‌కు చేరుకుంటారు. ఏ సమయంలో తన గత తప్పుల నుండి పాఠాలు తీసుకుంటూ సరబ్జోత్ మనుతో కలిసి పతకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించాడు. సరబ్‌జోత్, మనుల జోడీ భారత్‌కు షూటింగ్ లో ఒలింపిక్ చరిత్రలో ఆరో పతకాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2008లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు . వ్యక్తిగతంగా స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇతడితో పాటు రాజ్యవర్ధన్ సింగ్ 2004లో రజతం, గగన్ నారంగ్ 2012లో కాంస్యం, విజయ్ కుమార్ 2012లో రజతం షూటింగ్‌లో ఒలింపిక్ పతకాలు సాధించిన ఇతర భారత ఆటగాళ్లు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!