బాలీవుడ్ యాక్టర్ పరిణితీ చోప్రా ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్ లో ఉన్న భామ ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్దమైంది. ఈ నెల 13న ఈ ప్రేమజంట ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ఇప్పటికే బీ టౌన్ లో తెగ చర్చ జరుగుతుంది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్ లోనే వివాహబంధంలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
Also Read : Trisha : అందంతో పిచ్చెక్కిస్తున్న త్రిష.. స్టైలిష్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా
ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన పరిణితీ చోప్రా, రాఘవ్ మరోసారి సందడి చేశారు. ఈ సారి ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో కనిపించి అభిమానులకు కనువిందు సర్ ప్రైజ్ చేశారు. పంజాబ్ లోని మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్ కు ఈ లవర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పరిణితీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ పెట్టుకొవడంతో అవి ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Medaram: మేడారం జాతరకు తేదీలు ఖరారు.. వివరాలు తెలిపిన పూజారులు
మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్-ముంబాయి ఇండియన్స్ టీమ్స్ తలపడ్డాయి. కాగా.. గతంలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ముంబయిలోని ఓ రెస్టారెంట్ లో కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చాలా సార్లు జంటగా మీడియా కంట పడ్డారు. అంతే కాకుండా ఈ లవ్ బర్డ్స్ కు ఆప్ నేతలు సైతం ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.